Crime : పార్ట్ టైమ్ జాబ్స్ పేరుతో మోసం.. లక్షల్లో దండుకున్న గుజరాత్ ముఠా

ఫ్లోరా సొల్యూషన్స్ లో పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరిట అమాయకులను మోసం చేసి భారీగా డబ్బు దండుకున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ అశోక్, సాగర్ పాటిల్, అల్పేశ్ త్రాట్, నీలేశ్ లను గుజరాత్ సూరత్ లో అదుపులోకి తీసుకోగా వీరిపై దేశవ్యాప్తంగా 358 కేసులున్నట్లు గుర్తించారు.

New Update
Crime : పార్ట్ టైమ్ జాబ్స్ పేరుతో మోసం.. లక్షల్లో దండుకున్న గుజరాత్ ముఠా

Data Entry : పార్ట్ టైమ్ ఉద్యోగాల(Part Time Jobs) కోసం ఎదురు చూస్తున్న వారిని మోసం చేసి భారీగా డబ్బు దండుకున్న ముఠాను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్(Hyderabad) లో డేటా ఎంట్రీ(Data Entry) పేరుతో ఉద్యోగాలిచ్చి.. ఆ తర్వాత కంపెనీ నిబంధనలు ఉల్లంఘించారని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు(Cyber Crime Police) అరెస్ట్ చేశారు. నిందితులు రాహుల్ అశోక్, సాగర్ పాటిల్, అల్పేశ్ త్రాట్, నీలేశ్ లను గుజరాత్ లోని సూరత్ లో అదుపులోకి తీసుకున్నారు.

ఫ్లోరా సొల్యూషన్స్ పేరుతో..
నిందితులు ఫ్లోరా సొల్యూషన్స్(Flora Solutions) లో డేటా ఎంట్రీ ఉద్యోగాలు అని సోషల్ మీడియా(Social Media) లో ప్రకటనలు ఇవ్వడంతో నిరుద్యోగులు దానికి ఆశపడ్డారు. వారిచ్చిన నెంబర్లకు కాల్ చేసి ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అయితే.. ఉద్యోగాల్లో చేర్చుకున్న తర్వాత కంపెనీ రూల్స్ అతిక్రమించారని ఫేక్ నోటీసులు పెట్టి.. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే డబ్బులు కట్టాలని బెదిరించి డబ్బులను తీసుకునేవారు.

25 రాష్ట్రాల అమాయకులను..
ఇలా ఒకటి కాదు రెండు కాదు.. 25 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమాయకులను ముఠా మోసం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డేటా ఎంట్రీ ఆపరేటర్ గా అవకాశం ఇచ్చామని చెప్పి లాగిన్ ఐడీ పంపించి పనిచేయమని సూచిస్తారు. అదంతా నిజమేనని నమ్మిన బాధితులు ఆ సంస్థ ఇచ్చిన పనిని పూర్తి చేస్తారు. కంపెనీ నిబంధనలకు లోబడి పని చేయలేదని, రూల్స్ ఉల్లంఘించారని ఉద్యోగులకు సంస్థ నుంచి లీగల్ నోటీసులు పంపి బెదిరింపులకు పాల్పడుతారు. ఆ తర్వాత అందిన కాడికి దోచుకుంటారు. ఇలా అనేక మంది దగ్గర పెద్ద మొత్తంలో వసూలు చేశారు.

ఇది కూడా చదవండి : Hyderabad: పబ్బుల్లో డ్రగ్స్ దందా.. మరో ముఠా అరెస్ట్

ఫేక్ లీగల్ నోటీసులు..
హైదరాబాద్ కు చెందిన ఓ మహిళను కూడా ఇలాగే ఫేక్ లీగల్ నోటీసులతో బెదిరించి.. పలు దశల్లో 6 లక్షల 17 వేల రూపాయలు దండుకున్నారు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి చివరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు బయటకు వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగి ముఠాను అదుపులో తీసుకున్నారు. నిందితుల్లో ఏ1గా ఉన్న వ్యక్తి గతంలో టెలీకాలర్ గా పనిచేశాడని, తన మిత్రులతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది.

దేశ వ్యాప్తంగా 358 కేసులు..
వారినుంచి 6 మొబైల్ పోన్లు, ఒక ల్యాప్ టాప్ తో పాటు 5 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా పై దేశ వ్యాప్తంగా 358 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ వ్యాప్తంగా 28 కేసులు.. సైబరాబాద్ పరిధిలో 11 కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఇలాంటి ఫేక్ ముఠా చేతుల్లో నిరుద్యోగులు మోసపోవద్దంటూ పోలీసులు సూచించారు.

Advertisment
తాజా కథనాలు