Mount Everest : వయసుకు మించిన సాహసం.. ఎవరెస్ట్‌ ఎక్కేసిన నాలుగేళ్ల చిన్నారి

చెక్‌ రిపబ్లిక్‌ కు చెందిన నాలుగేళ్ల బాలిక జారా.. ఎవరెస్ట్‌ ఎక్కేసింది. తండ్రి, సోదరుడితో కలిసి సముద్రమట్టానికి 17,500 అడుగుల ఎత్తులో ఉండే బేస్‌క్యాంప్‌ చేరుకుంది. భారత్‌కు చెందిన ప్రిషా రికార్డును బ్రేక్ చేసి ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది.

New Update
Mount Everest : వయసుకు మించిన సాహసం.. ఎవరెస్ట్‌ ఎక్కేసిన నాలుగేళ్ల చిన్నారి

Mount Everest: ఓ నాలుగేళ్ల చిన్నారి వయసుకు మించిన సాహసం చేసి ఔరా అనిపించింది. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. ఈ మేరకు చెక్‌ రిపబ్లిక్‌ (Czech Republic)కు చెందిన నాలుగేళ్ల బాలిక జారా (Zara) ఏకంగా ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ (Mount Everest Base Camp) అధిరోహించింది. అంతేకాదు ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. గతేడాది 5 ఏళ్ల వయసులో ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు చేరుకున్న భారత్‌కు చెందిన ప్రిషా లోకేశ్ నికాజూ పేరుమీద ఉన్న రికార్డును జారా బ్రేక్ చేసింది.

ఇది కూడా చదవండి :Sania: మాలిక్ ఎఫైర్స్ పై సానియా ఫైర్.. ఆ ఫొటోలన్నీ డిలిట్!

ఈ మేరకు చెక్‌ రిపబ్లిక్‌ దేశస్థురాలైన జారా.. కొంతకాలంగా తన కుటుంబంతో కలిసి మలేషియాలో ఉంటోంది. అయితే ఇటీవలే ఆమె తన తండ్రి డేవిడ్‌ సిఫ్రా, ఏడేళ్ల సోదరుడితో కలిసి ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ వద్దకు చేరుకుంది. ఆ దృశ్యాలను జారా సోదరుడి పేరుతో ఉన్న ఇన్‌స్టా ఖాతాలో ఆమె కుటుంబం పోస్ట్‌ చేసింది. ‘‘చిన్నారి జారా ఎన్నడూ వేడి నీటితో స్నానం చేయదు. మంచు ముక్కలతో ఆడుకుంటుంది. అందుకేనేమో ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ను చేరుకోవడంలో ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. కొన్నిసార్లు మిగతా ట్రెక్కర్ల కంటే వేగంగా ముందుకెళ్లింది’’ అని ఆ పోస్ట్‌లో తెలిపారు.

ఇక జారాకు చిన్నప్పటి నుంచి నడవడం అంటే చాలా ఇష్టమట. రోజుకు కనీసం 5 నుంచి 10 కిలోమీటర్లు నడుస్తుందని ఆమె తండ్రి సిఫ్రా గతంలో ఓ మీడియాకు తెలిపారు. గతేడాది మొత్తం ఆమె 2,200 కి.మీ.లు నడిచిందట. అదే ట్రెక్కింగ్‌పై ఆమెకు ఆసక్తిని పెంచిందన్నారు. ఈ చిన్నారి ఇప్పటికే చెక్‌, చైనీస్‌, ఇంగ్లీష్‌ భాషలను మాట్లాడుతుంది. ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌నకు చేరుకునేటప్పుడు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఉష్ణోగ్రతలు ఒక్కోసారి -25 డిగ్రీలకు పడిపోతాయి. ఇలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ జారా.. 170 మైళ్లు ప్రయాణించి సముద్రమట్టానికి సుమారు 17,500 అడుగుల (5,364 మీటర్ల) ఎత్తులో ఉండే బేస్‌క్యాంప్‌ వద్దకు చేరుకుంది. ప్రస్తుతం జారా కుటుంబం అక్కడి నుంచి కిందికి దిగేందుకు ప్రయాణం మొదలుపెట్టింది.

Advertisment
తాజా కథనాలు