Life Span: మనుషుల ఆయుష్షు పెంచే ప్రయోగం సక్సెస్‌..

మనుషుల జీవితకాలాన్ని పెంచేందుకు తయారుచేసిన ఓ ఔషధం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎలుకలపై జరిపిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో మనుషుల ఆయుష్షు కూడా పెంచవచ్చనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయోగంలో ఎలుకల జీవితం కాలం 20 నుంచి 25 శాతం పెరిగినట్లు పరిశోధకులు తెలిపారు.

Life Span: మనుషుల ఆయుష్షు పెంచే ప్రయోగం సక్సెస్‌..
New Update

సాధారణంగా అందరూ ఎక్కువ కాలం బతకాలని కోరుకుంటారు. పెద్దలు కూడా నిండు నూరేళ్లు జీవించు అంటూ ఆశీర్వాదం ఇస్తారు. కానీ ప్రస్తుతం మాత్రం సంపూర్ణంగా జీవించే పరిస్థితులు లేవు. తినే ఆహారం, వాతావరణ మార్పుల వల్ల మనిషి ఆయుష్షుపై ప్రభావం చూపిస్తోంది. అయితే మనుషుల జీవితకాలాన్ని పెంచాలనే ఉద్దేశంతో తయారుచేసిన ఓ ఔషధం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎలుకలపై జరిపిన ఈ ప్రయోగం విజయవంతం అవ్వడంతో మనుషుల ఆయుష్షు కూడా పెంచవచ్చనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: ‘మైక్రోసాఫ్ట్’ క్రాష్​.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన బ్యాంకింగ్, విమాన సేవలు!

లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన ఎంఆర్‌సీ ల్యాబొరేటరీ ఆఫ్ మెడికల్ సైన్స్, సింగపూర్‌లోని డ్యూక్- ఎన్‌యూఎస్‌ మెడికల్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు తయారుచేసిన ఈ ఔషధానికి సంబంధించిన వివరాలు 'నేచర్' అనే జర్నల్‌లో ప్రచూరితమైంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. పరిశోధకులు ఈ ప్రయోగంలో భాగంగా ఇంటర్‌ల్యూకిన్‌-11 అనే ప్రొటీన్‌పై ఫోకస్‌ పెట్టారు. అయితే వయసు పెరిగేకొద్ది శరీరంలో దీని స్థాయిలు కూడా పెరుగుతాయి. వృద్ధాప్యానికి ఇదే ప్రధాన కారణమని పరిశోధకులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఇంటర్‌ల్యూకిన్‌ -11 ఉత్పత్తిని అడ్డుకునేందుకే ఓ ఔషధాన్ని అభివృద్ధి చేశారు.

ఇందుకోసం 75 వారాల వయసున్న ఎలుకలపై ప్రయోగించారు. అయితే ఇది దాదాపు మనుషులకు 55 ఏళ్ల వయసుతో సమానం. ఈ ఔషధాన్ని ప్రయోగించిన ఎలుకల జీవితం కాలం 20 నుంచి 25 శాతం పెరిగినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనలో ఎలుకల కండరాల పనితీరు మెరుగయ్యిందని.. సన్నగా, చురుగ్గా మారిందని, వెంట్రుకలు ఎక్కువగా వచ్చినట్లు గుర్తించారు. ఎలుకలపై ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రస్తుతం మనుషులపై కూడా ప్రయోగిస్తున్నారు. ముందుగా ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్‌తో బాధపడుతున్న వాళ్లకి ఈ ఔషధం ఇచ్చినట్లు ప్రొఫెసర్ స్టువర్ట్ కుక్ చెప్పారు. అలాగే ఇది మనుషులు తీసుకునేందుకు సురక్షితమే అని తాము గుర్తించామని పేర్కొన్నారు. అయితే మనుషులపై ఇది ఎలా, ఏ విధంగా పనిచేస్తుందనే అనే విషయం తేలాల్సి ఉంది.

Also Read: వర్షాకాల సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ తో పాటు ఆరు కొత్త బిల్లులు

#telugu-news #mice #human-lide #drug
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe