Niharika: మెగా డాటర్ నిహారిక జాతకంపై ఇంట్రెస్టింగ్ చర్చ.. సోషల్ మీడియాలో రచ్చ

నటి నిహారిక-ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడిచింది. నిహారిక ఆస్క్ మీ ఎనిథింగ్ సెషన్ నిర్వహించగా ఒక ఫాలోవర్ అరచేతిని చూపించమన్నాడు. ఎందుకు బాబు నా జాతకం ఏమైనా చెబుతావా? నా ఫ్యూచర్ గురించి నాకు తెలియకపోతేనే సంతోషంగా ఉంటానంటూ ఫన్నీ రిప్లై ఇచ్చింది.

New Update
Niharika: మెగా డాటర్ నిహారిక జాతకంపై ఇంట్రెస్టింగ్ చర్చ.. సోషల్ మీడియాలో రచ్చ
Niharika: మెగా డాటర్ నిహారిక మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. పెళ్లి, విడాకుల ఇష్యూతో కొంతకాలంగా సెలైంట్ అయిపోయిన నటి మళ్లీ నెట్టింట యాక్టివ్ అయింది. అభిమానులతో ఇన్ స్టా, ట్విట్టర్ వేదికగా చిటా చాట్ (Chit chat) నిర్వహిస్తోంది. ఆస్క్ మీ ఎనిథింగ్ (Ask Me Anything) అంటూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్ స్టా వేదికగా ఫాలోవర్లతో ముచ్చటించిన ఆమె ఫ్యామిలీ, పర్సనల్ అండ్ కెరీర్ కు సంబంధించిన చాలా విషయాలు షేర్ చేసుకుంది.
ఈ క్రమంలోనే తన అభిరుచులకు సబంధించి చెట్లు నాటడం, నాట్యం చేయడం, ట్రావెలింగ్ తదితర అంశాలను ఎంజాయ్ చేస్తానని చెప్పింది. ఇక ఫ్యామిలీతోనూ గడపడంతోపాటు ఫ్రెండ్స్ తో పార్టీలకు వెళ్లడాన్ని ఆశ్వాదిస్తానంది. అయితే ఓ అభిమాని నిహారికకు సంబంధించి కొన్ని సీక్రెట్స్ అడిగేందుకు తెగ ట్రై చేయగా ఆమె స్పందిచలేదు. దీంతో కనీసం ఒకసారి 'మీ అరచేతిని చూపించండి' అంటూ రిక్వెస్ట్ చేశాడు. దీంతో ఫన్నీగా రియాక్ట్ అయిన నిహారిక.. ‘ఎందుకు బాబు నా జాతకం ఏమైనా చెబుతావా? ఏమీ వద్దు బాబు.. నా ఫ్యూచర్ గురించి నాకు తెలియకపోతేనే నేను సంతోషంగా ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పెళ్లి, విడాకులకు సంబంధించి కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Guntur Kaaram pre release event: గుంటూరు కారం ప్రి రిలిజ్ వాయిదా పడింది ..కొత్త డేట్ ఎప్పుడంటే.!!

publive-image

కథక్ నృత్యంతో అట్రాక్ట్..

ఇక ఇదిలావుంటే.. ఇటీవల తనలో కొత్త యాంగిల్ చూపించి జనాలను ఆశ్చర్యపరిచింది. యెల్లో కలర్ డ్రెస్ తో కాళ్లకు గజ్జె కట్టిన ముద్దుగుమ్మ కథక్ నృత్యం చేస్తున్న ఫొటోలను నెట్టింట షేర్ చేసి కుర్రాళ్ల మతిపోగొట్టింది. న్యూఇయర్ లోకి అడుగుపెట్టిన సందర్భంగా క్లాసిక్ డ్యాన్స్ లో తనకున్న టాలెంట్ అంతా చూపిస్తూ కాళ్లకు గజ్జెలు, తలలో మల్లెపూలు పెట్టుకొని అద్భుతంగా డ్యాన్స్ చేసినట్లుగా ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ హోయల్ పోయింది. 2023లో తనను సంతోష పెట్టింది ఈ కథక్ నృత్యమేనంటూ సంబరపడిపోయింది. ఇక విడాకుల అనంతరం తన కెరీర్ పై పూర్తి ఫోకస్ చేస్తూ వృత్తిపరమైన జీవితంలో బిజీ అవుతోంది నిహారిక. ఒకవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది.

Advertisment
తాజా కథనాలు