Tragedy: వియాత్నంలో ఘోర అగ్ని ప్రమాదం. అపార్ట్మెంట్లో మంటలు చెలరేగి. 50మందికి పైగా మృతి..!! వియాత్నంలో విషాదం నెలకొంది. హనోయి అగ్నిప్రమాదం వియత్నాం రాజధాని హనోయిలోని తొమ్మిది అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో 50కి పైగా మరణించారు, పలువురు గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్యను అధికారంగా ఇంకా వెల్లడించలేదు. అధికారిక వియత్నాం న్యూస్ ఏజెన్సీ (VNA) 150 మంది నివాసితులు ఉన్న భవనంలో అర్ధరాత్రి మంటలు చెలరేగినట్లు పేర్కొంది. By Bhoomi 13 Sep 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి వియత్నాం రాజధాని హనోయ్‌లోని తొమ్మిది అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50కి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారని అధికారిక వార్తా సంస్థను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. అపార్ట్ మెంట్ లో అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 50కి పైగా మరణించారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. ఈ భారీ అగ్నిప్రమాదాన్ని అధికారులు ధృవీకరించారని డాక్ ట్రి వార్త పత్రిక వెల్లడించింది. అగ్నిప్రమాదంలో ఆసుపత్రిలో చేరిన 54మంది లో చాలా మంది మరణించారని ఆ పత్రికలో తెలిపింది. రాత్రి 11.30గంటలకు మంటలు ఎగిసిపడ్డాయని..ఆ సమయంలో చాలా మంది తమ ప్లాట్లో ఉన్నట్లు పేర్కొంది. ఇది కూడా చదవండి: ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ వాయిదా…హమ్మయ్య ఇప్పటికైనా చెప్పారు ప్రమాదానికి గురైన అపార్ట్ మెంట్ ఇరుకైన సందిలో ఉంది. దీంతో మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చింది. ఫైరింజన్లను చాలా దూరంలో పార్క్ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అక్కడి నుంచే సిబ్బంది పైపుల ద్వారా మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. అతికష్టం మీద మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా గతేడాది కూడా దక్షిణ వియాత్నంలో మూడంతస్తుల భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 32మంది ప్రాణాలు కోల్పోయారు. ఇద ఒక దశాబ్దంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంగా మారింది. తాజా ప్రమాదంలో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఫైర్ సిబ్బంది నిచ్చెల ద్వారా పైపులు వేసి మంటలను అదుపులోకి తీసుకురావడం కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: కేంద్ర మంత్రిని గదిలో వేసి నిర్బంధించిన సొంతపార్టీ నేతలు! #tragedy #vietnam-fire-accident #50-people-died మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి