Breaking: కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి రూ. 2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపాడంటూ చేసిన ఆరోపణలపై బత్తిన శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 504,505 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Breaking: కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు..
New Update

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి రూ. 2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపాడు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బత్తిన శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దీంతో ఐ పీ సీ 504,505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బంజారా హిల్స్ పోలీసులు తెలిపారు.

పేగులు కోసి మెడలో వేసుకుంటా..

అయితే ఈ వ్యవహారంలో ముందుగా హనుమకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి బంజారా హిల్స్ పంపించారు పోలీసులు. ఇక దీనిపై హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. పురపాలక శాఖను తన ఆధీనంలో ఉంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి మూడు నెలలు చెల్లించి వసూలు చేసిన రూ.2,500 కోట్లను ఢిల్లీకి పంపితేనే భవనాలకు అనుమతులు ఇస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పేగులు కోసుకుంటానని, మెడలో వేసుకుంటానని చెబుతున్న రేవంత్ కు సీఎంగా పని చేసేంత తెలివి లేదంటూ విమర్శలు చేశారు.

#criminal-case #brs-mla-ktr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe