Cockroach: వృద్ధుడి ఊపిరితిత్తుల్లో బొద్దింక.. కంగుతిన్న డాక్టర్లు!

ఓ వృద్ధుడి ఊపిరితిత్తుల్లో బొద్దింక చేరి కుళ్లిపోయిన సంఘటన కేరళలోని కొచ్చిలో చోటుచేసుకుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందంటూ ఆస్పత్రిలో చేరగా ఈ విషయం బయటపడింది. నాలుగు సెంటీమీటర్ల పొడవైన బొద్దింకను బయటకు తీశారు డాక్టర్లు. రోగి క్షేమంగా ఉన్నాడు.

Cockroach: వృద్ధుడి ఊపిరితిత్తుల్లో బొద్దింక.. కంగుతిన్న డాక్టర్లు!
New Update

KERALA: శ్వాస తీసుకోవడంలో కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి వచ్చిన సమస్య చూసి డాక్టర్లు కంగుతిన్నారు. సాధారణంగా లంగ్స్ ఇన్ఫెక్షన్, క్యాన్సర్ తదితర సమస్యలు ఉంటాయనుకుని మొదట టెస్టులు నిర్వహించిన వైద్య బృందానికి ఊహించని షాక్ తగిలింది. రోగి ఊపిరితిత్తుల్లో బొద్దింక చేరినట్లు వైద్యులు గుర్తించిన సంఘటన కేరళలోని కొచ్చిలో చోటుచేసుకుంది.

నాలుగు సెంటీమీటర్ల బొద్దింక..
ఈ మేరకు అమృత హాస్పటల్ డాక్టర్ టింకు జోసెఫ్ నేతృత్వంలోని వైద్యుల బృందం తెలిపిన వివరాల ప్రకారం.. 55 ఏళ్ల రోగి శ్వాస సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చాడు. అయితే అతడి ఊపిరితిత్తులను పరిశీలించగా ఊపిరితిత్తుల్లో నాలుగు సెంటీమీటర్ల పొడవున్న బొద్దింక ఇరుక్కుపోయినట్లు గుర్తించామని చెప్పారు. దీంతో రోగి ఊపిరితిత్తుల్లో కుళ్లిపోయిన బొద్దింకను బయటకు తీసేందుకు ఎనిమిది గంటల సమయం పట్టిందని తెలిపారు. 'ఫిబ్రవరి 22న ఈ ఆపరేషన్ జరిగింది. అతనికి శస్త్రచికిత్స చేయడం కాస్త కష్టంగా మారింది' అని వివరించారు.

ఇది కూడా చదవండి: Lion Bite : సింహం నోట్లో చేయిపెట్టిన యువకుడు.. మూడు పళ్లతో అదిమిపట్టిన మృగం!

ఎలా లోపలికి వెళ్లిందంటే..
ఇక అతని ఊపితిత్తుల్లోకి ఎలా చేరిందని పరిశీలించగా గతంలో ఆ వృద్ధుడు చికిత్స చేయించుకునేందుకు వెళ్లినప్పుడు ఓ ట్యూబ్ పెట్టారట. ఆ ట్యూబ్ లో ఉన్న బొద్దింక నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరింది. ప్రస్తుతం రోగి పూర్తిగా క్షేమంగా ఉన్నాడని తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదిలావుంటే.. ఇటీవల ఆ వ్యక్తి ముక్కులో 150కి పైగా లైవ్ బగ్స్ కనిపించడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. రోగికి యాంటీ-పారాసిటిక్ రిన్స్‌తో సహా ప్రత్యేక చికిత్స అందించి వాటిని వెంటనే తొలగించారు.

#cockroach #lungs #55-years-man-kerala
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe