Crime: బతికున్న కోడిపుంజును ఎద్దుకు తినిపించిన దుర్మార్గులు.. వీడియో వైరల్

జల్లి కట్టు ఎద్దుకు బతికున్న కోడిపుంజును తినిపించిన సంఘటన తమిళనాడులో కలకలం రేపింది. జల్లికట్టు పోటీలకోసం ఎద్దును మచ్చిక చేసుకునేందుకు ఈ చర్యకు పాల్పడిన వ్యక్తులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Crime: బతికున్న కోడిపుంజును ఎద్దుకు తినిపించిన దుర్మార్గులు.. వీడియో వైరల్
New Update

Tamil Nadu: రోజురోజుకు మనిషి తన పైశాచిక ఆనందం కోసం కౄరమైన చర్యలకు పాల్పడుతున్నాడు. తను అనుకున్నది చేయడంకోసం ఎంతటి దుర్మార్గానికైనా వెనకాడట్లేదు. తోటి మనుషుల పట్లనే కాదు ఈ భూమిపై మనతో జీవిస్తున్న మూగ జీవుల పట్ల కూడా కర్కశంగా వ్యవహరిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు. ఈ మేరకు పూర్తి శాఖాహారి అయిన ఒక ఎద్దుకు పచ్చిమాంసం తినిపించిన సంఘటన తమిళనాడులో కలకలం రేపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బతికున్న కోడిపుంజు..
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు  రాష్ట్రం సేలం జిల్లాలోని చిన్నప్పంపట్టిలో జల్లి కట్టు (Jallikattu) ఎద్దుకు ముగ్గురు వ్యక్తులు కలిసి బతికున్న కోడిపుంజును తినిపించారు. అయితే ఈ తతంగాన్ని మొత్తం రఘు అనే య్యూటూబర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. అయితే ఈ చర్యపై ఆందోళన చెందిన 'పీపుల్ ఫర్ క్యాటిల్ ఎయిమ్ ఇండియా' (PFCI) అనే జంతు సంరక్షణ సంస్థ వ్యవస్థాపకుడు అరుణ్ ప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి : Ayodhya Rammandir: రామాలయ ప్రారంభోత్సవం రోజున అందరూ అలా చేయండి.. ప్రధాని పిలుపు

పలు సెక్షన్ల కింద కేసు నమోదు..
ఈ మేరకు తారమంగళం పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కు లేఖ రాసిన అరుణ్ ప్రసన్న.. ఎద్దులు శాకాహారులని, జంతువుల పచ్చి మాంసాన్ని తినిపించడం వల్ల తెలియని వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని సూచించారు. 'రూస్టర్‌ను బలవంతంగా పట్టుకుని ఎద్దుకు తినిపించిన తీరు తీవ్రమైన భయాందోళనకు గురిచేసింది. చాలా బాధ కలిగించింది. ఎద్దు పళ్ల మధ్య బతికున్న కోడి నలిగిపోవడం చూడటం కాదు ఊహించుకుంటేనే కష్టంగా ఉంది' అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. అలాగే జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద ఈ చర్యకు పాల్పడిన వ్యక్తులపై మతపరమైన మనోభావాలను దెబ్బతీసే అభియోగాలతో సహా కేసు నమోదు చేయాలని ఆయన పోలీసులను కోరారు.

మచ్చిక చేసుకునేందుకే..
ఈ క్రమంలో వెంటనే చర్యలు చేపట్టిన పోలీసులు యూట్యూబర్ రఘుతోపాటు మిగతా ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అయితే జల్లికట్టులో ఎద్దుల ప్రదర్శనకు ముందు ఆ ఎద్దును మచ్చిక చేసుకునే లక్ష్యంతో కోడిని తినిపించామని నిందితులు చెబుతున్నారు. అలాగే గెలిచిన ఎద్దులు.. వాటి యజమానులు బంగారు నాణేలతోపాటు బహుమతులు అందుకుంటామని యజమానులు చెబుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

#bull #jallikattu #tamilnad #live-rooster
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి