పవన్ కళ్యాణ్‌పై కృష్ణలంక పీఎస్‌లో కేసు నమోదు

వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదైంది. వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులకు సమాచారం ఇస్తున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి. మహిళలకు పెద్ద సంఖ్యలో గల్లంతవుతున్నా వారి అచూకీ కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారని ఇటీవల పవన్ ఆరోపించారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఉండే మహిళల సమాచారాన్ని పక్కదారి పట్టిస్తున్నారని పవన్ ఆరోపించడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.

New Update
పవన్ కళ్యాణ్‌పై కృష్ణలంక పీఎస్‌లో కేసు నమోదు

పలు సెక్షన్ల కింద కేసు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలో 228 సచివాలయంలో పనిచేస్తున్న అయోధ్య నగర్‌కు చెందిన దిగమంటి సురేష్‌బాబు ఫిర్యాదు చేశారు. ఏలూరు వారాహి యాత్రలో వాలంటీర్లపై పవన్‌ వ్యాఖ్యలపై 405/2023 కింద ఫిర్యాదు స్వీకరించి.. పవన్‌పై సెక్షన్ 153,153A,505(2)IPCసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పవన్ వ్యాఖ్యల మూలంగా రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని సెక్షన్లు చేర్చారు.

 A case has been registered against Pawan Kalyan in Krishna Lanka PS

వాలంటీర్‌ వ్యవస్థను తీరుపై..

ఏలూరు వారాహి యాత్రలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలను అదుపు చేయడానికే వాలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చారని.. వాలంటీర్లు సేకరించిన డేటా ఎక్కడికి వెళ్తుందని ప్రశ్నించారు. తాను చెప్పేది అందరు వాలంటీర్ల గురించి కాదన్నారు.. ప్రతి ఇంటి డేటా అంతా వాలంటీర్లకి తెలుసన్నారు. ప్రభుత్వ ఉద్దేశం మరొకటి కావొచ్చు.. సెన్సిటీవ్‌ ఇన్ఫర్మేషన్‌ బయటకు వెళ్తే ఎలా అన్నారు పవన్‌ కళ్యాణ్‌. రాష్ట్రంలో 6 కోట్ల ఆంధ్రుల సమాచారం హైదరాబాద్‌కు ఎందుకు పోతోందని పవన్‌ ప్రశ్నించారు. నానాక్‌రాంగూడాలోని ఎఫ్‌శోఏ ఏజెన్సీ ఎవరిదని..ఆ సంస్థలోని 700 మందికి జీతాలు ఇస్తోంది ఎవరని ప్రశ్నించారు. సమాచారం పక్కదారి పడితే సీఎం జగన్ బాధ్యత తీసుకుంటారా అని ప్రశ్నించారు. యువతను స్వయంశక్తివంతులను చేసేందుకే తమ పోరాటం.. ఓటు వేసిన పాపానికి ఆంధ్రా ప్రజలను కాటు వేశారన్నారని పవన్‌ అన్నారు.

A case has been registered against Pawan Kalyan in Krishna Lanka PS

ఒంటరి మహిళలే టార్గెట్..

ఇదిలాంటే వాలంటీర్లు నాకు సోదర సమానులు.. వారి పొట్ట కొట్టాలని తాను అనుకోనన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న రూ.5వేలకు మరో 5వేలు ఇచ్చేంత అభిమానం ఉందన్నారు. బుట్టలో రెండు చెడిపోయిన మామిడిపండ్ల వల్ల మిగిలినవీ పాడైనట్లు.. వాలంటీర్లలో కొందరు దుర్మార్గులున్నారన్నారు. వారు ఒంటరి మహిళలే లక్ష్యంగా పనిచేస్తున్నారని.. లొంగనివారి పథకాలు తొలగిస్తామని బెదిరిస్తున్నారన్నారు. వాలంటీర్ల దెబ్బకు ప్రజలు గద్ద కాళ్లకింద కోడిపిల్లలా అల్లాడిపోతున్నారన్నారు. తమ హక్కులు అడిగినందుకు అంగన్‌వాడీ కార్యకర్తలను కొట్టిస్తారా అని పవన్ ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలో హనుమాయమ్మ అనే అంగన్‌వాడీ కార్యకర్తను చంపేశారని.. తనపై ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోవాలన్నారు. జగన్ సతీమణి భారతి తనకు సోదరి సమానురాలు అన్నారు. తానెప్పుడూ ఆమె ప్రస్తావన తీసుకురాలేదన్నారు. జగన్‌ మాత్రం తన భార్యను పెళ్లాం అని సంబోధిస్తారన్నారు. పిల్లల సభలో పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చి దిగజారిపోతారన్నారని అన్నారు.

శాంతి భద్రతలపై..
తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ వాలంటీర్లు ఫిర్యాదు చేయడంతో విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్‌పై ఐపీసీ పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజల మధ్య చిచ్చు రాజేసేందుకు ప్రయత్నించినందుకు కేసు నమోదు చేశారు. బహిరంగ వేదికపై ఈ వ్యాఖ్యలు చేసినందుకు 153ఏ సెక్షన్ కూడా చేర్చారు. వాలంటీర్లను అవమానించేలా, నిందపూర్వక వ్యాఖ్యలు చేసినందుకు ఐపీసీ 502(2) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Advertisment
Advertisment
తాజా కథనాలు