Pocharam: పోచారం ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు

TG: పోచారం ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. మొత్తం 12 మంది నాయకులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వారిపై ఐపీసీ 353, 448 సెక్షన్ల కింద కేసు పెట్టినట్టు సమాచారం. కేసు నమోదు అయిన వారిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ఉన్నారు.

New Update
Pocharam: పోచారం ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు

TG: మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. మొత్తం 12 మంది నాయకులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వారిపై ఐపీసీ 353, 448 సెక్షన్ల కింద కేసు పెట్టినట్టు సమాచారం. కేసు నమోదు అయిన వారిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ఉన్నారు.

publive-image

సీఎం రేవంత్ సీరియస్..

పోలీసులపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సీరియస్ అయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) ఇంటి దగ్గర పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం శ్రీనివాస్ ఇంటి గేటు లోపలికి చొచ్చుకెళ్లి మెయిన్ డోర్ దగ్గర బాల్క సుమన్ సహా బీఆర్ఎస్ (BRS) శ్రేణుల ఆందోళనలు చేశారు. పదుల సంఖ్యలో పోచారం ఇంట్లోకి బీఆర్ఎస్ నేతలు చొరబడ్డారు. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలతో పోచారం శ్రీనివాస్ ఇంటి దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోచారం ఇంటికెళ్లారు వెస్ట్ జోన్ డీఎస్పీ విజయ్ కుమార్. బాల్క సుమన్ సహా బీఆర్ఎస్ నేతలు చొరబడిన తీరును అడిగి తెలుసుకున్నారు. వారిపై తగిన చర్యలు ఉంటాయని చెప్పారు. అలాగే పోచారం నివాసానికి సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ కూడా వెళ్లారు.

Advertisment
తాజా కథనాలు