Atal Setu Bridge : అసాధారణ రీతిలో యువతిని కాపాడిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్!

ముంబై అటల్‌సేతు బ్రిడ్జిపై నుంచి ఓ మహిళ సముద్రంలో దూకుతుండగా క్యాబ్ డ్రైవర్ అసాధారణ రీతిలో రక్షించాడు. చివరి క్షణంలో ఆమె జుట్టుపట్టుకుని పోలీసుల సాయంతో పైకి లాగాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. క్యాబ్ డ్రైవర్, పోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

New Update
Atal Setu Bridge : అసాధారణ రీతిలో యువతిని కాపాడిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్!

Mumbai : ముంబైలో అటల్‌సేతు బ్రిడ్జి (Atal Setu Bridge) పై ఓ మహిళ అత్యాహత్య (Suicide) చేసుకునేందుకు ప్రయత్నించింది. క్యాబ్ బుక్ చేసుకొని మరీ బ్రిడ్జి వద్దకు వచ్చిన ఆమె.. క్యాబ్‌ నుంచి దిగి వేగంగా రెయిలింగ్‌ అవతలి వైపునకు దూసుకెళ్లింది. దీంతో వెంటనే అప్రమత్తమైన క్యాబ్ డ్రైవర్ అసాధారణ రీతిలో ప్రాణాలు కాపాడారు. సముద్రంలోకి దూకేందుకు సిద్ధమైన ఆమె జట్టు పట్టుకొని చాలా సేపు నీళ్లలో పడకుండా పట్టుకున్నాడు. వెంటనే అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించగా.. స్థానిక ట్రాఫిక్ పోలీసుల అప్రమత్తం చేశారు. దీంతో క్షణాల్లో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మహిళను పైకి లాగి కారు ఎక్కించారు. ఇందుకు సంబంధించిన సంఘటన సీసీ ఫుటేజీలో రికార్డ్ అవగా.. సోషల్‌ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. యువతి ప్రాణాలు కాపాడిన క్యాబ్ డ్రైవర్, పోలీసులను శభాష్ అంటూ జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read : రుణమాఫీ ద్రోహం.. రైతుల పాలిట కాంగ్రెస్ శాపం: బీఆర్ఎస్ వినూత్న ప్రచారం

Advertisment
తాజా కథనాలు