New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T152633.882.jpg)
Bus Falls Into Gorge In Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మూ-పూంచ్ జాతీయ రహదారి (144A)పై అఖ్నూర్‌లోని తుంగి మోర్ ప్రాంతంలో బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ప్రస్తుతం 7గురు మరణించగా, 30 మంది తీవ్ర గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్ నంబర్‌కు చెందిన ఈ బస్సు జమ్మూ నుండి శివఖోడికి వెళ్తోంది. ఈ సమయంలో అఖ్నూర్‌లోని తుంగి మోర్ వద్ద లోతైన గుంటలో పడింది. బస్సులో 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్థానికి అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.