Shakira : పాప్ స్టార్ ష‌కీరా ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్.. కొలంబియాలో స్టాచ్యూ ఓపెన్

పాప్ స్టార్ షకీరా తన ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. బారన్‌క్విల్లాలో తన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు చెబుతూ నెట్టింట పోస్ట్ పెట్టింది. బెల్లీ డ్యాన్స్ పోజ్‌లో ఉన్న విగ్రహాన్ని నగర మేయర్ జైమ్.. షకీరా తల్లిదండ్రులతో కలిసి ఆవిష్కరించారు. ఇది 6.5మీ-పొడవు ఉంది.

New Update
Shakira : పాప్ స్టార్ ష‌కీరా ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్.. కొలంబియాలో స్టాచ్యూ ఓపెన్

Shakira: ప్రముఖ పాప్ స్టార్ షకీరా తన అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. తన ఆట పాటలతో కొంతకాలంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఆమె.. తాజాగా సొంత ఊర్లో తన మైనపు బొమ్మను (statue) ఆవిష్కరించినట్లు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తాను పాపులర్ అయిన బెల్లీ డ్యాన్స్ (Belly dance) ఫోజులో ఈ విగ్రహం రూపొందించగా నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

View this post on Instagram

A post shared by Shakira (@shakira)

ఈ మేరకు కొలంబియాకు చెందిన గాయని షకీరా.. స్వస్థలమైన బారన్‌క్విల్లా (Barranquilla) లో ఆమె కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. బెల్లీ డ్యాన్స్ పోజ్‌లో తయారు చేసిన ఈ విగ్రహాన్ని నగర మేయర్ జైమ్ పుమారెజో (Jaime Pumarejo) మంగళవారం మాగ్డలీనా నది ఒడ్డున ఉన్న పార్కులో షకీరా తల్లిదండ్రులతో కలిసి ఆవిష్కరించారు. 6.5మీ-పొడవు (21.3అడుగులు) కాంస్యం ఆమె జనాదరణ పొందిన హిప్స్ డోంట్ లై వీడియోలో ఎక్కువగా ప్రదర్శించబడిన డ్యాన్స్ మూవ్‌తో ఆకట్టకుంటోంది. ఇక ఈ ఆర్టిస్ట్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి పలు ఫోటోలను షేర్ చేస్తూ.. 'ఈ స్టాచ్యూను ఆవిష్కరించ‌డం గౌర‌వంగా భావిస్తున్నా. బారంక్విలా ఎప్పటికీ నా సొంత ఊరే అవుతుంది' అంటూ ఎమోషనల్ అయింది.

publive-image

ఇక ఈ ప్రత్యేక మూమెంట్ పై మాట్లాడిన మేయర్ జైమ్.. అమ్మాయిలు త‌మ క‌ల‌ల‌ను నేర‌వేర్చుకోవచ్చు. త‌మ‌కు కావాల్సిన ల‌క్ష్యాల‌ను అందుకోవ‌చ్చు. చిన్న పిల్లగా ఉన్న స‌మ‌యంలో ష‌కీరా స్థానిక క‌చేరీల్లో ప్రద‌ర్శన ఇవ్వడాన్ని నేను దగ్గరినుంచి చూశాను' అంటూ షకీరాపై ప్రశంసలు కురిపించారు. ఈ విగ్రహాన్ని ఆర్టిస్టు యినో మార్క్వేజ్ రూపొందించాడు. సింగ‌ర్ ష‌కీరా ప్రస్తుతం మియామీలో ఉంటోంది.

Advertisment
తాజా కథనాలు