కిడ్నీ స్టోన్‌.. దెబ్బకు గిన్నీస్ రికార్డు సొంతం......

New Update

ప్రపంచంలో జరిగే వింతలు, విశేషాలను ఏదో ఓ చోట మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అందులో... కొన్ని జంతువులకు సంబంధించినవి అయితే మరికొన్ని మానవులకు సంబంధించినవి... అలా ఎన్నో, మరెన్నో.. ఇలా సోషల్‌ మీడియాలో వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూ వస్తుంటాయి. అయితే ఇక్కడ మాత్రం అరుదైన చికిత్స చేసి గిన్నీస్ రికార్డులో చోటు సంపాదించారు. ఒక్కటి కాదు.. రెండు కాదు.... ఏకంగా 5.264 అంగుళాల అతిపెద్ద కిడ్నీ స్టోన్‌ని బయటకు తీసి హౌరా అనిపించారు. ఇంతకీ ఇదెక్కడ జరిగిందనే కదా మీ డౌట్ అయితే అదేంటో తెలియాలంటే పుల్ డీటెయిల్స్‌లోకి వెళ్లాల్సిందే.....

A-big-rock-suddenly-came-out-in-the-kidney-Guinness-record-was-created-with-a-blowb

కిడ్నీలో రాళ్లు ఏర్పడడం గురించి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇక్కడ దాదాపు ప్రతీ ఇద్దరిలో ఒక్కరికి ఈ సమస్య అనేది సాధారణంగా ఉంటుంది. కాబట్టి అయితే ఆ రాళ్లు అనేవి చిన్నచిన్న సైజులో ఉంటాయి. అలాగే ఇవి చాలా వరకు వాటంతట అవే శరీరం నుంచి యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతుంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ రాయిని శ్రీలంక ఆర్మీ వైద్యులు సర్జరీ చేసి తొలగించారు. శ్రీళంక రాజధాని కొలంబోలోని ఆర్మీ హాస్పిటల్‌లో ఈ నెల మొదటి వారంలో జరిగిన కిడ్నీ సర్జరీలో ఒకటి కాదు.. రెండు కాదు.. 13.372 సెంటీమీటర్ల పొడవు, 801 గ్రాముల బరువున్న రాయిని కిడ్నీ నుంచి తీశారు. ఈ విషయాన్ని శ్రీలంక ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రికార్డును గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ధృవీకరించినట్లు తెలిపారు. 13.372 సెం.మీ,, 5.264 అంగుళాలు అతిపెద్ద కిడ్నీ స్టోన్ ను జూన్ 1న కొలంబోలోని కానిస్టస్ కూంఘేలో ఉన్న ఆస్పత్రిలో తొలగించారని వెల్లడించింది.

అయితే... కన్సల్టెంట్ యూరాలజిస్ట్ లెఫ్టినెంట్ కల్నల్ డా. కె. సుతర్షన్, హాస్పిటల్‌లోని జెనిటో యూరినరీ యూనిట్ హెడ్, కెప్టెన్, డబ్ల్యుపిఎస్‌సి పతిరత్న, డాక్టర్ థమాషా ప్రేమతిలక కలిసి ఈ సర్జరీ నిర్వహించారని తెలిపింది. ఇంతకు ముందు 2004లో ప్రపంచంలోనే అతి పెద్ద కిడ్నీ రాయిని దాదాపు 13 సెంటీమీటర్లు ఇండియాలో సర్జరీ ద్వారా తొలగించారు. అయితే అత్యంత బరువున్న 620 గ్రాముల కిడ్నీ రాయిని 2008లో పాకిస్థాన్‌లో సర్జరీ చేసి తొలగించారు. వాటన్నింటిని దాటుకొని ప్రస్తుతం ముందు వరుసలో నిలిచింది. రికార్డును ధృవీకరిస్తూ, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇలా చెప్పింది, "అతిపెద్ద కిడ్నీ స్టోన్ 13.372 సెం.మీ (5.264 అంగుళాలు), మరియు జూన్ 1, 2023న శ్రీలంకలోని కొలంబోలోని కానిస్టస్ కూంఘే (శ్రీలంక) నుండి తొలగించబడింది." గతంలో 13 సెంటీమీటర్ల రికార్డును 2004 నుండి అధిగమించలేదని పేర్కొంది.ఇలాంటివి మనం నిత్యం జీవన విధానంలో మార్పుల వల్ల ఇలాంటివి జరుగుతుంటాయని వైద్యులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు