Bank Locker: బ్యాంక్ లాకర్ కు చెదలు.. మట్టిగా మారిన రూ.18 లక్షలు.. ఈ దారుణం ఎక్కడంటే?

రాత్రింబవళ్ళు కష్టపడి..రూపాయి రూపాయి పోగు చేసుకుని బిడ్డ పెళ్లికోసం బ్యాంకు లాకర్ లో డబ్బు దాచుకుంది ఓ మహిళ. ఒకటి కాదు...రెండు కాదు..ఏకంగా రూ. 18లక్షలకు చెదలు పట్టింది. దీంతో ఆ మహిళ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో జరిగింది.

New Update
Bank Locker: బ్యాంక్ లాకర్ కు చెదలు.. మట్టిగా మారిన రూ.18 లక్షలు.. ఈ దారుణం ఎక్కడంటే?

యూపీలోని మొరాదాబాద్ లోని బ్యాంక్ లాకర్ లో మహిళ దాచిపెట్టుకున్న 18లక్షల రూపాయలకు చెదలు పట్టింది. మొత్తం డబ్బును చెదలు ముక్కముక్కలుగా చేశాయి. ఇది చూసిన ఆ మహిళ షాక్ అయ్యింది. ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్ కు ఫిర్యాదు చేసింది.

అసలేం జరిగిందో చూద్దాం :
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ రామగంగా విహార్ లోని ఆషియానా కాలనీలో నివసిస్తున్న పాఠక్...స్థానికంగా పరుపుల వ్యాపారం నిర్వహిస్తోంది. ఆమెకు బ్యాంక్ ఆఫ్ బరోడా రామగంగా బ్రాంచులో అకౌంట్ ఉంది. కొన్నాళ్ల క్రితం ఇదే బ్యాంకులో పాఠక్ లాకర్ అకౌంట్ తీసుకుంది. గతేడాది అక్టోబర్ నెలలో పాఠక్ తన కుమార్తె పెండ్లి చేసింది. ఆ సందర్భంగా బంధుమిత్రులు డబ్బులు, నగల రూపంలో కానుకలు ఇచ్చారు. ఇవన్నీ తీసుకెళ్లి పాఠక్ లాకర్ లో దాచుకుంది. మొత్తం 18లక్షలతోపాటు విలువైన నగలను లాకర్ లో భద్రపరిచింది.

ఇది కూడా చదవండి:  ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..!!

అయితే ఈనెల 25వ తేదీన కేవైసీ లాకర్ అగ్రిమెంట్ రెన్యువల్ కోసం పాఠక్..బ్యాంకుకు వెళ్లింది. ఆ సమయంలో లాకర్ ను తెరిచిన ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. డబ్బు మొత్తం చెదలు తినడంతో లబోదిబోమంటూ బయటకువచ్చింది. ఈ విషయాన్నివెంటనే బ్యాంకు మేనేజర్ కు చెప్పింది. అది చూసిన బ్యాంక్ మేనేజర్ నగలు భద్రంగా ఉన్నాయని తెలిపారు. కేసును విచారిస్తున్నట్లు వెల్లడించారు. బ్యాంకు లాకర్ లో డబ్బులు ఉంచకూడదన్న విషయం తనకు తెలియదని పాఠక్ తెలిపింది.

తన కూతురి పెళ్లి కోసం విడిగా డబ్బులు పోగు చేసి లాకర్ లో పెట్టుకున్నానని అల్కా పాఠక్ తెలిపింది. బ్యాంక్ మేనేజర్ వివేక్ కుమార్ మాట్లాడుతూ, అల్కా పాఠక్ ఫిర్యాదు తర్వాత, బ్యాంక్ లాకర్‌ను చూశానని, అక్కడ చెదపురుగులు ధ్వంసం చేసిన డబ్బు బ్యాగ్ లాకర్ వెలుపల నేలపై పడి ఉందని చెప్పారు. చెదపురుగులు, ఇతర పురుగుల నివారణకు బ్యాంకులో క్రమబద్ధమైన చర్యలు తీసుకుంటారు. లాకర్ లోపలికి చెదపురుగులు ఎలా చేరాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్స్ పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం!

ఖాతాదారుడి డిమాండ్ మేరకు లాకర్లను కేటాయిస్తున్నట్లు బ్రాంచ్ మేనేజర్ వివేక్ కుమార్ తెలిపారు. బ్యాంకు ఖాతాదారుడు లాకర్‌లో ఉంచిన దాని గురించి బ్యాంకు వద్ద సమాచారం లేదు. నిబంధనల ప్రకారం పాడైపోయే వస్తువులను లాకర్‌లో ఉంచకూడదు. లాకర్‌లో డబ్బు ఉంచడంపై పూర్తి నిషేధం ఉంది. విచారణ నివేదిక అందిన తర్వాతే ఈ వ్యవహారంలో ఏదో ఒకటి చెప్పగలమని వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు