మసీదులను భజరంగ్ దళ్ కార్యాలయాలుగా మారుస్తాం..!

మసీదులన్నింటినీ భజరంగ్ దళ్ కార్యాలయాలుగా మారుస్తామని మధ్యప్రదేశ్ లో భజరంగ్ దళ్ కార్యకర్త చేసిన నినాదాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మధ్యప్రదేశ్ లోని సాహెర్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఈ నినాదాలు చేశారు. ఈనెల 25వ తేదీని సాహోర్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ తోపాటు పలు హిందూ సంస్థలు హిందూ జాగరణ్ యాత్ర నిర్వహించాయి. ఈ ర్యాలీలో హిందూ విశ్వపరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ శర్మ...సాహోర్ జిల్లాలోని అన్ని మసీదులను భజరంగ్ దళ్ ఆఫీసులుగా మార్చస్తామంటూ నినదించారు.

మసీదులను భజరంగ్ దళ్ కార్యాలయాలుగా మారుస్తాం..!
New Update

మసీదులన్నింటినీ భజరంగ్ దళ్ ఆఫీసులుగా మారుస్తామంటూ ఆ సంస్థ కు చెందిన కార్యకర్త ఒకరు హెచ్చరిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో క్లిప్ మధ్యప్రదేశ్ లోని సాహోర్ జిల్లాకు చెందింది. ఈనెల 25వ తేదీని సాహోర్ జిల్లాలో భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ తోపాటు మరికొన్ని సంస్థలు హిందూ జాగరణ్ యాత్రను చేపట్టాయి.

bajrang-dal

లవ్ జిహాద్, మత మార్పిడిలకు వ్యతిరేకంగా ఈ యాత్రను చేపట్టారు. సాహోర్ జిల్లాలోని 130 గ్రామాల్లో మొత్తం 130 కిలోమీటర్ల వరకు ఈ ర్యాలీ కొనసాగింది. హిందువులను ఏకం చేయడమే ఈ ర్యాలీ ప్రధాన లక్ష్యమని హిందూ విశ్వపరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ శర్మ ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మతమార్పిడిలు, లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ హిందువులను చైతన్యవంతులు చేయడమే లక్ష్యంగా క్రుషి చేస్తున్నామని తెలిపారు.

అయితే ఈ ర్యాలీలో భజరంగ్ దళ్ కుచెందిన ఓ కార్యకర్త ఒకరు ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. సాహోర్ జిల్లాలోని అన్ని మసీదులను భజరంగ్ దళ్ కార్యాలయాలుగా మారుస్తామన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

కాగా గత నెలలో ఇండోర్ లో ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ కు వ్యతిరేకంగా మసీదు సమీపంలో అభ్యంతరకర పత్రాలను పంపిణీ చేసిని పదిమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూ సంస్థకు చెందిన మహిళ ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe