Ayodhya Ram Mandir: ఎవరీ మోహిత్ పాండే..అతనినే అయోధ్య రామ మందిర ప్రధానార్చకునిగా ఎందుకు నియమించారు! అయోధ్య రామ మందిరానికి ప్రస్తుతం సత్యేంద్ర దాస్ ప్రధాన పూజారిగా ఉన్నారు. ఆయన తరువాత స్థానంలో 22 సంవత్సరాల మోహిత్ పాండే అనే యువకుడ్ని ఆలయాధికారులు ఎంచుకున్నారు. అసలు ఎవరు ఈ మోహిత్ ..అతనినే ఎందుకు ఎంచుకున్నారు అనేది ఈ కథనంలో చదివేయండి. By Bhavana 21 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఏర్పాట్లన్ని చకచకా అయిపోతున్నాయి. ఇప్పటికే బాలరాముడు(Ram Lalla) గర్భగుడికి చేరుకున్నాడు. రామ మందిరంలో పూజలు సైతం ప్రారంభం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహత్తర కార్యం జరగడానికి ఇంకా 24 గంటల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో రామ మందిర ప్రధానార్చకుడి గురించి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయోధ్య శ్రీరామునికి సుమారు 31 సంవత్సరాల నుంచి ఆచార్య సత్యేంద్ర దాస్ (Satyendra das) అనే అర్చకుడే ప్రధాన పూజా కార్యక్రమాలన్నింటిని జరిపిస్తున్నారు. ఆయన 1958 వ సంవత్సరంలో అయోధ్యకు శాశ్వతంగా వచ్చేశారు. అప్పటి నుంచి ఆయన రాముల వారి సేవలోనే ఉన్నారు. అప్పటి నుంచి నేటి వరకు.. దాంతో ఆయనను 1992లో ఆలయ ప్రధాన పూజారిగా (Chief Priest) నియమించారు. అప్పటి నుంచి కూడా నేటి వరకు ఆయనే ప్రధాన పూజారిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ముసలి వారు అయ్యారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. దీంతో అయోధ్య రామమందిరంలో ఆయన తరువాత ప్రధానార్చుకునిగా వేరొకరిని నియమించే బాధ్యతలను కూడా సత్యేంద్రకే అప్పగించింది. అనేక షరతులు.. ఇందుకుగానూ 2023లోనే యూపీ ప్రభుత్వం రామ మందిర పూజారి నియామక ప్రక్రియను ప్రారంభించింది. సుమారు ఈ పదవి కోసం 3 వేల మంది అప్లైయ్ చేసుకున్నారు. అయితే రామ మందిర ప్రధానార్చకులు అవ్వాలంటే అంత తేలికైన విషయం కాదు. ఆలయాధికారులు అనేక షరతులు పెట్టారు. దీనికి దరఖాస్తు చేసుకునే వారి వయసు 20 నుంచి 30 లోపు నే ఉండాలన్నారు. గురుకుల పాఠశాలలో చదివి ఉండాలన్నారు. రాముల వారి దీక్షకు అర్హతను కలిగి ఉండాలని నిబంధనలు కూడా పెట్టారు. 3 వేల దరఖాస్తుల్లో నుంచి 200 మందిని వడబోశారు. వారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించగా.. దానికి యూపీలోని ఘజియాబాద్ కు చెందిన 22 ఏళ్ల మోహిత్ పాండే(Mohit Pandey) కూడా ఈ ఇంటర్వ్యూకి వచ్చారు. వచ్చిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసే ప్యానెల్ లో హిందూ ప్రవక్త జై కాంత్ మిశ్రా, అయోధ్యలోని మహంత్ మిథిలేష్, నంది శరణ్, సత్యనారాయణ దాస్ ఉన్నారు. 200 మంది నుంచి 21 మందిని.. ఈ సందర్భంగా వారు అభ్యర్థులను శ్రీరామునికి సంబంధించిన పూజలకు సంబంధించిన ప్రశ్నలు, సంధ్యా వందనం అంటే ఏమిటి, పూజా పద్దతులు, కర్మకాండ అంటే ఏమిటి, రామునికి ఎలాంటి మంత్రాలు పఠిస్తారనే వివిధ రకాల ప్రశ్నలు అడిగారు. 200 మంది నుంచి 21 మందిని ఎంపిక చేసుకున్నారు. ఈ 21 మందిలో ఒకరు ప్రధాన అర్చకులుగా ఉండగా..20 మంది సహాయ అర్చకులుగా ఉంటారు. సత్యేంద్ర దాస్ ప్రశంసలు.. ఇలా ఎంచుకున్న వారిలో ప్రధానంగా చర్చకు వస్తున్న పేరు మోహిత్ పాండే. కేవలం 22 సంవత్సరాలకే ఆయన రామ మందిర ప్రధాన అర్చకునిగా నియమించడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలలో మోహిత్ తనకంటే పెద్ద పండితులను,అనుభవం ఉన్న పూజారులను ఓడించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ ప్రశంసలు అందుకున్నాడు. మోహిత్ తాను పదేళ్ల వయసులోనే వేదాలను పఠించడం ప్రారంభించాడు. మోహిత్ 2020-2021 విద్యా సంవత్సరంలో ఘజియాబాద్ లోని దుదేశ్వర్ వేద్ విద్యా పీఠ్ లో తన విద్యను పూర్తి చేశాడు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం లో ఎంఏ డిగ్రీ చదివి పీహెచ్‌డీకి సిద్దం అవుతున్నాడు. సత్యేంద్ర దాస్ తరువాత.. సత్యేంద్ర దాస్ తరువాత మోహిత్ పాండే అయోధ్య రామ మందిర ప్రధానార్చకునిగా బాధ్యతలను స్వీకరించనున్నాడు. ప్రస్తుతం మోహిత్ శిక్షణ తీసుకుంటున్నారు. Also read: పూలు, లైటింగ్ తో మెరిసిపోతున్న అయోధ్య..! #ayodhya-ram-amndir #mohith-pandey #chief-priest మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి