ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో నిన్న ఉదయం ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివసిస్తున్న ఒక మహిళ ఓ విమానయాన సంస్థలో పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త కూడా ఎయిర్‌లైన్స్ ఉద్యోగే. వీరు రెండు నెలల కిందట ఓ 10 ఏళ్ల బాలికను ఇంట్లో పనికి కుదుర్చుకున్నారు.చిన్నారి చేయి, కళ్లుకి తీవ్ర గాయాలైయ్యాయి. దీనం కోపంతో మహిళ ఫైలట్పై బంధువులు చెప్పులతో దాడి చేశారు.
అయితే, ఈరోజు ఉదయం బాలికను చూసేందుకు వచ్చిన ఆమె బంధువు ఒకరు చిన్నారి శరీరంపై గాయాలను గుర్తించారు. పైలట్, ఆమె భర్త.. చిన్నారిని హింసిస్తున్నట్లు తెలుసుకున్న బాలిక బంధువు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే, పోలీసులు వచ్చేలోగా ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, బాలిక బంధువులు మహిళా పైలట్ ఇంటి ముందుకు వచ్చి ఆ దంపతులతో గొడవపడ్డారు. వీధిలోకి లాగి వారిపై మూకదాడికి దిగారు.
ఆఫీస్ యూనిఫామ్‌లో ఉన్న మహిళా పైలట్‌ను కొందరు మహిళలు జుట్టు పట్టి లాగి, కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అడ్డువచ్చిన పైలట్ భర్తపైనా మహిళలు దాడి చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మూకను అడ్డుకున్నారు. మైనర్ బాలికను పనిలో పెట్టుకున్నందుకు గానూ కేసు నమోదు చేసి పైలట్, ఆమె భర్తను అరెస్టు చేశారు. చిన్నారికి వైద్యపరీక్షలు నిర్వహించామని, ఆమెపై లైంగిక వేధింపులు జరగలేదని పోలీసులు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.