Kejriwal: కేజ్రీవాల్ కు మరో బిగ్ షాక్.. ఛార్జ్ షీట్ లో ఆమ్ ఆద్మీ పార్టీ!

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో దాఖలు చేయనున్న తదుపరి ఛార్జిషీట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పేరు చేర్చబోతున్నట్లు ఢిల్లీ హైకోర్టుకు ఈడీ తెలిపింది. ఎక్సైజ్ పాలసీ కేసులో బెయిల్ కోరుతూ ఆప్ నేత మనీష్ సిసోడియా పిటిషన్‌ను కోర్టు పరిశీలిస్తున్న సమయంలో కేంద్ర ఏజెన్సీ ఈ విషయం తెలిపింది.

New Update
Kejriwal: 8.5కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. ఆందోళనలో ఆప్‌!

Delhi: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో దాఖలు చేయనున్న తదుపరి ఛార్జిషీట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పేరు దోషిగా చేర్చబోతున్నట్లు ఢిల్లీ హైకోర్టుకు ఈడీ తెలిపింది. ఎక్సైజ్ పాలసీ కేసులో బెయిల్ కోరుతూ ఆప్ నేత మనీష్ సిసోడియా పిటిషన్‌ను కోర్టు పరిశీలిస్తున్న సమయంలో కేంద్ర ఏజెన్సీ ఈ విషయం తెలిపింది.

ఛార్జిషీట్ పరిశీలనపై వాదనలను..
సప్లిమెంటరీ చార్జిషీట్‌లో ఆప్‌ని దోషిగా చేర్చుతారని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ED దాఖలు చేసిన ఆరో అనుబంధ ఛార్జిషీట్ పరిశీలనపై వాదనలను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మే 20కి వాయిదా వేసింది. బీఆర్‌ఎస్ నాయకురాలు కె.కవిత జ్యుడిషియల్ కస్టడీని కూడా కోర్టు మే 20 వరకు పొడిగించింది.

ఇది కూడా చదవండి: Jail for GST Officer: లంచం కేసులో జీఎస్టీ అధికారికి మూడేళ్ళ జైలు..

ఈ రోజుతో ముగిసిన కవిత రిమాండ్..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ అరెస్ట్ చేసిన కేసుకు సంబంధించి ఈ రోజుతో కవిత రిమాండ్ ముగియగా దీంతో ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు అధికారులు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆమె కస్టడీని మరో 6 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మే 20 వరకు కవిత జ్యూడీషియల్ కస్టడీలోనే ఉండనున్నారు. ఈ కేసుకు సంబంధించి 8 వేల పేజీలతో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపై మే 20న విచారణ చేపడతామన్న జడ్జి తెలిపారు. ఇదిలా ఉంటే.. కవిత అరెస్టు అయి రేపటితో రెండు నెలలు పూర్తి కానుంది.

Advertisment
తాజా కథనాలు