9th Class Girl Pregnant : తొమ్మిదో తరగతి(9th Class) చదువుతున్న ఓ బాలిక మగబిడ్డ(Baby Boy) కు జన్మనిచ్చిన ఘటన కర్ణాటకలోని(Karnataka) తుమకూరులో చోటుచేసుకుంది. ఈ నెల 9వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం ఉన్న యువత దారి ఎటువైపు పోతుందనే దానిపై చర్చకు దారి తీసింది.
ALSO READ: రైతులకు గుడ్ న్యూస్.. ఎకరాకు రూ.8,000!
పూర్తి వివరాలు..
బాగేపల్లిలోని కాశపురాకు చెందిన 14 ఏళ్ల వయసు గల బాలిక చిక్కబల్లాపూర్‌లోని(Chikkaballapur) ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ హాస్టల్(Govt Social Welfare Hostel) ఉంటూ తొమ్మిదో తరగతి చదువుకుంటుంది. ఇటీవల ఆ బాలిక తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లివచ్చింది. ఇంటి దగ్గరే ఉన్న ఆమెకు కడుపు నొప్పి రావడంతో ఆమె తల్లిదండ్రులు గ్రామంలో ఉన్న సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. సాధారణ కడుపు నొప్పి అని అనుకున్న వైద్యులు ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చి ఇంటికి పంపించారు.
తగ్గని కడుపునొప్పి..
వైద్యులు వైద్యం చేసిన ఆ బాలికకు కడుపు నొప్పి(Abdominal Pain) తగ్గకపోవడంతో మరోసారి ఆసుపత్రికి తీసుకొని తల్లిదండ్రులు వెళ్లారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించగా ఊహించని విషయం తల్లిదండ్రలను చీకట్లోకి నెట్టింది. తమ కూతురు స్కూళ్లో చదువుకుంటుందని అనుకున్న తల్లిదండ్రులకు షాకింగ్ విషయం తెలిసింది. తమ కూతురు గర్భంతో ఉందని వైద్యులు చెప్పేసరికి తల్లిదండ్రులు కుప్పకూలారు. పురుటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆమె ఓ బాలుడికి జన్మనిచ్చింది. తల్లీ, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఇద్దరినీ జిల్లా ఆసుపత్రికి తరలించారు వైద్యులు.
ఇది సీనియర్ పనే..
మైనర్ బాలిక గర్భం దాల్చడంపై పోక్సో(POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు అక్కడి పోలీసులు. దీనిపై విచారణ చేపట్టారు. తన సీనియర్ వల్లే గర్భం దాల్చినట్లు ఆ బాలిక పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదుతో ఆ బాలుడిని విచారించగా తాను ఏమి చేయలేదని ఆ బాలుడు పోలీసులకు తెలిపాడు.ఈ కేసుపై ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, బాలిక మాటల్లో నిలకడ లేదని పోలీస్ అధికారులు వెల్లడించారు. పాఠశాలలో మరో విద్యార్థి పేరు కూడా ఆమె చెబుతుందని అన్నారు. దీంతో అందరినీ విచారించి బాధ్యుల్ని గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై స్పందించిన జిల్లా అధికారులు హాస్టల్ వార్డెన్‌తో పాటు అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు.
ALSO READ: వైసీపీకి రాజీనామా.. ఎమ్మెల్యే పెండెం దొరబాబు క్లారిటీ