వివరాల్లో వెళ్తే.. నిందితుల్లో ఒకరితో ఇన్‌స్ట్రాగామ్‌లో బాలికకు పరిచయం ఉంది. అయితే.. ఆ స్నేహంతో కలవాలంటూగా ఒక రోజు బాలికను బయటకు పిలిచాడు. దీంతో ఆ బాలిక.. ఒక స్థలానికి వచ్చిది. ఆమె రాగానే కారులో వేచి ఉన్న మరో ఇద్దరు స్నేహితులు రైడింగ్‌కు వెళ్దామంటూ ఆహ్వానించారు. బాలిక కారులోకి ఎక్కగానే ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. అంతేకాకుండా ఈ దృశ్యాలను మొబైల్‌లో వీడియోలు తీశారు. ఈ వీడియోను అడ్డంపెట్టుకుని బాలికను తమతో బయటకు రావాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ బయపెట్టారు. లేదంటే వీడియో పేరెంట్స్‌కు పంపిస్తామని బెదిరిస్తున్నారు. బాలిక వారితో వెళ్లేందుకు నిరాకరిచటంతో నిందితులు మాత్రం అన్నంత పని చేశారు. అత్యాచార వీడియోను అమ్మాయి తల్లిదండ్రులకు పంపించారు. వెంటనే బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. రగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తూ.. నిందితులపై అత్యాచారం, కిడ్నాప్ తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలి:
అయితే.. బాలికతో మైనర్‌కు స్నేహం ఉందని ఆ చనువుతోనే ఆమె దగ్గరకు వెళ్లింది. అతడి దగ్గరకు వెళ్లగానే కారులో రైడ్‌కు వెళ్దామని కారు ఎక్కించుకున్నాడు. కారులో అప్పటికే మరో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. కారు హైవేపైకి వెళ్లాక.. ఒకరి తర్వాత ఒకరు గ్యాంగ్‌రేప్ చేశారు. అంతేకాకుండా వీడియో ద్వారా బాలికను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆమె నిరాకరించడంతో కుటుంబ సభ్యులకు పంపించారని తెలిపారు. దీంతో కుమార్తెను కుటుంబసభ్యులు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారని వెళ్లడించారు. ముగ్గురు నిందితులపై విద్యార్థిని వాంగ్మూలం ప్రకారం.. పోలీసులు కేసు నమోదు చేశారని పోలీస్ అధికారి తెలిపారు. త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ చెప్పారు. అమ్మాయిలు పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: గర్భధారణ సమయంలో ఈ లక్షణాలు కనిపిస్తే గర్భస్రావం ప్రమాదం ఉన్నట్టే!