Illegal Transfer : చిన్నారులను(Children's) అక్రమంగా తరలిస్తున్న ముఠాను యూపీ చైల్డ్ కమిషన్(UP Child Commission) పట్టుకుంది. వారి వద్ద నుంచి సుమారు 95 మంది చిన్నారులను అధికారులు క్షేమంగా కాపాడారు. చిన్నారులను బీహార్(Bihar) నుంచి యూపీకి తరలిస్తుండగా రెస్క్యూ ఆపరేషన్ చేసి రక్షించింది. ఇంత పెద్ద స్థాయిలో పిల్లల్ని అక్రమ రవాణా చేయడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్నట్లుగా సమాచారం రాగానే సీడబ్ల్యూసీ సభ్యులు చిన్నారులను రక్షించారని అయోధ్య చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(Ayodhya Child Welfare Committee) చైర్‌పర్సన్ సర్వేష్ అవస్థి తెలిపారు. యూపీ చైల్డ్ కమిషన్ సభ్యురాలు సుచిత్ర చతుర్వేది ఫోన్ చేసి ఈ విషయం గురించి సమాచారం అందించారని తెలిపారు.
బీహార్ నుంచి మైనర్ పిల్లలను అక్రమంగా సహరాన్‌పూర్‌కు రవాణా చేస్తున్నారని.. వారు గోరఖ్‌పూర్ వెళ్తున్నట్లుగా తెలిసిందన్నారు. అయోధ్య మీదుగా వెళ్తున్నారని చెప్పారు. పిల్లల్ని రక్షించి వారికి ఆహారం.. వైద్యం అందించినట్లుగా అవస్తి చెప్పారు. అధికారులు రక్షించిన చిన్నారులంతా కూడా 4-12 ఏళ్లలోపు వారేనని తెలిపారు.
తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సమ్మతి పత్రాలు లేకుండానే పిల్లల్ని తీసుకెళ్తున్నట్లుగా సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ తెలిపారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియలేదని పేర్కొన్నారు. పిల్లలంతా పన్నేండ్లలోపు వారేనని తెలిపారు. తల్లిదండ్రుల్ని సంప్రదించి పిల్లల్ని వారికి అప్పగిస్తామని సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ పేర్కొన్నారు.
Also read: మరికాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల!