South Central Railway: 94 రైళ్లు రద్దు..41 రూట్‌ మార్పు!

సెప్టెంబర్‌ చివరి వారంలో 94 రైళ్లను రద్దు చేస్తుండగా..41 రైళ్లను రూట్‌ మార్చుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.వరంగల్‌-హసన్‌పర్తి-కాజీపేటెఫ్‌ క్యాబిన్‌ మధ్యలో రెండు లైన్ల మార్గాన్ని, నాలుగు లైన్లుగా అందుబాటులోకి తీసుకుని వచ్చే పనుల నేపథ్యంలో రద్దు చేసినట్లు సమాచారం.

New Update
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దు..!

South Central Railway: సెప్టెంబర్‌ నాలుగో వారం నుంచి రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనున్నట్లు అధికారులు తెలిపారు. 94 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రకటించడమే ఇందుకు కారణం. వరంగల్‌-హసన్‌పర్తి-కాజీపేటెఫ్‌ క్యాబిన్‌ మధ్యలో ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల మార్గాన్ని, నాలుగు లైన్లుగా అందుబాటులోకి తీసుకుని వచ్చే పనుల నేపథ్యంలోనే రద్దు చేసినట్లు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇందులో కొన్ని రైళ్లు కనిష్ఠంగా ఓ రోజు, గరిష్ఠంగా 15 రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని తెలిపారు. 41 రైళ్లను దారి మళ్లించి నడుపుతారు. మరో 27 రైళ్ల ప్రయాణ వేళలను మార్చారు. రద్దయిన వాటిలో గోల్కొండ, శాతావాహన ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌- గుంటూరు ఇంటర్‌ సిటీ వంటి రైళ్లు ఈ లిస్ట్‌ లో ఉన్నాయి.

మరికొన్ని సౌత్‌ స్టేట్స్‌ నుంచి తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించేంది కూడా ఉన్నాయి. కాజీపే- సిర్పూర్‌ టౌన్‌---సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 7 వరకు, సిర్పూర్‌ టౌన్‌- కాజీపేట రైలు సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 8 వరకు రద్దు చేశారు.

భద్రాచలం రోడ్‌- బళ్లార్ష , బళ్లార్ష- కాజీపేట సెప్టెంబర్‌ 29- అక్టోబర్‌ 8 వరకు రద్దు చేసినట్లు అధికారులు వివరించారు. సికింద్రాబాద్‌-సిర్పుర్‌ కాగజ్‌ నగర్‌, సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌- సికింద్రాబాద్‌ సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్ 7 వరకు రద్దయ్యాయి.

గుంటూరు-సికింద్రాబాద్‌ , సికింద్రాబాద్‌-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 8 వరకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గుంటూరు-సికింద్రాబాద్‌ , సికింద్రాబాద్‌- గుంటూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్‌ 2 వరకు రద్దయ్యాయి.

విజయవాడ-సికింద్రాబాద్‌,సికింద్రాబాద్‌-విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 7వరకు రద్దయ్యాయి.

Also Read:  జన్వాడ ఫాంహౌస్‌కు పర్మిషన్ లేదు.. అధికారుల సంచలన ప్రకటన

Advertisment
తాజా కథనాలు