మహారాష్ట్రలో నందత్ జిల్లాలోని ముక్వంతండా అనే గ్రామంలో మొత్తం 107 ఇళ్లు ఉన్నాయి. అక్కడ సుమారు 500 మంది నివసిస్తున్నారు.ఆ గ్రామంలో ఉన్న ఓ స్థానికులు బావిలోని నీటిని తాగుతున్నారు.ఈ క్రమంలో కడుపునొప్పి, వాంతులతో 93 మంది ప్రభుత్వాసుపత్రిలో చేరారు.
ఇదే గ్రామంలో అనేక మంది ప్రజలు అస్వస్థతకు గురికావడంతో వైద్యారోగ్యశాఖ అక్కడికి వెళ్లి ప్రత్యామ్నాయంగా తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేసింది.అయితే వారు అస్వస్థతకు గురికావటానికి గల కారణాలను అధికారులు ఎటువంటి ప్రకటనను విడుదల చేయలేదు.