Railways: 46 రైళ్ళల్లో 92 కొత్త జనరల్ కోచ్‌లు..రైల్వేశాఖ కీలక నిర్ణయం

ఎన్నున్నా రైలు ప్రయాణాలకున్న క్రేజ్ తగ్గదు. అన్నింటికన్నా రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతమైనది.అందుకే ఈ మధ్య కాలంలో ఇది మరీ ఎక్కువ అయిపోయింది. ఈ రద్దీ ఎక్కువై స్లీపర్,ఏసీ కోచ్‌లు కూడా నిండిపోతున్నాయి.దీంతో కొత్త జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.

New Update
Railway : రైల్వే శాఖ కీలక నిర్ణయం... ఇక నుంచి అలా చేస్తే జరిమానా తప్పదు!

New Coaches To Trains: భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాల మధ్య నడిచే ముఖ్యమైన 46 రైళ్లలో 92 కొత్త జనరల్ కో‌చ్‌లను ఏర్పాటు చేశామని.. కోచ్‌ల సంఖ్య పెంచుతున్నామని..రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. బెంగుళూరు సిటీ బెలగావి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ హుబ్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ముంబై బెంగళూరు ఉదయన్ ఎక్స్‌ప్రెస్, ముంబై అమరావతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గౌహతి లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్, గౌహతి జమ్ము తావి ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్‌లో కోచ్‌లను పెంచారు. వీటితో పాటూ మరో 22 రైళ్లల్లో కూడా త్వరలోనే అదనపు జనరల్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించామని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ట్రైన్స్‌కు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా 2024-24, 2025-26లో మరో 10,000 నాన్-ఏసీ కోచ్‌లను తయారు చేసే ప్రణాళికను రూపొందించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఇంతకు ముందే అనౌన్స్ చేసింది. ఇప్పటికి కేవలం నాన్ ఏసీ, జనరల్ కోచ్‌లను మాత్రమే పెంచింది. వీటిలో కూడా మరో 5444 కోచ్‌లను నెక్స్ట్ ఏడాదికి
పెంచే విధంగా చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన ఉత్పత్తి జరుగుతోందని చెప్పింది. అలాగే ప్రయాణికుల సౌకర్యాలు మెుగుపర్చడానికి అమృత్ భారత్‌లో కూడా జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేయనున్నామని చెబుతోంది రైల్వే శాఖ.

Also Read:Andhra Pradesh: ఆంధ్రాకు కేరళ కేడర్ ఐఏఎస్ కృష్ణతేజ

Advertisment
తాజా కథనాలు