TS: ప్రాణాలు తీస్తున్న గాలిపటం..ఇప్పటివరకూ ఎంత మంది చనిపోయారంటే..?

తెలంగాణలో సంక్రాంతి పండుగ సందర్భంగా పలుచోట్ల విషాదం చోటుచేసుకుంది. గాలిపటం కారణంగా ఇప్పటివరకు తొమ్మిది మంది చనిపోయారు. తాజాగా, హైద‌రాబాద్‌లోని ర‌హ‌మ‌త్‌న‌గ‌ర్‌లోనూ ఓ యువకుడు మృతి చెందాడు. గాలిపటం ఎగురవేస్తూ భ‌వ‌నంపై నుంచి ప‌డి మృతి చెందాడు.

New Update
TS: ప్రాణాలు తీస్తున్న గాలిపటం..ఇప్పటివరకూ ఎంత మంది చనిపోయారంటే..?

Telangana: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగుల సందడి కనిపిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఆకాశంలో గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందిస్తున్నారు. ఒకరి గాలిపటాన్ని మరొకరు కట్‌ చేస్తూ..కేరింతలు కొడుతున్నారు. అయితే, గాలిపటం ఎగురవేసేటప్పుడు ధ్యాసంతా దానిపైనే ఉండడంతో అనుకోకుండా ప్రమాదాలకు గురవుతున్నారు. మిద్దెలు, ఎతైన భవనాలు నుంచి గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్నారు. పలుచోట్ల విద్యుత్‌ తీగలకు చుట్టుకున్న గాలి పటాలను తొలగించే ప్రయత్నంలోనూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందుతున్నారు. ఇలా.. గాలిపటం కారణంగా తెలంగాణలోనే 9 మంది మృతి చెందారు.

Also Read: మాంజా మర్డర్స్.. చైనా దారంతో దారుణాలు.. తప్పెవరిది?

తాజాగా, హైదరాబాద్ లో గాలిపటం ఎగురవేస్తూ ఓ యువకుడు మృతి చెందాడు. మధురానగర్‌లో ఐదు అంతస్థుల భవనం పైనుంచి పడి దుర్మరణం చెందారు. అంతేకాకుండా యాప్రాన్‌లో గాలి పటం ఎగురవేస్తూ బాలుడు భువన్‌సాయి మరణించాడు. గాలిపటం ఎగురవేసేటప్పుడు కరెంటు తీగలకు దూరంగా ఉండాలని.. భవన పైనుంచి గాలి పటం ఎగురవేసేటప్పుడు గోడలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నా ప్రమాదాలు మాత్రం జరుగుతునే ఉన్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు