14 గంటల్లో 800 సార్లు భూకంపం.. ఆ దేశంలో ఆగమాగం

వరుస భూ ప్రకంపనలతో ఐస్‌లాండ్‌ వణికిపోతోంది. రెక్జానెస్‌ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం సుమారు 14 గంటల వ్యవధిలో 800 సార్లు ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజల రక్షణార్థం అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు తెలిపారు.

New Update
14 గంటల్లో 800 సార్లు భూకంపం.. ఆ దేశంలో ఆగమాగం

వరుస భూ ప్రకంపనలతో ఐస్‌లాండ్‌ వణికిపోతోంది. ఐరోపాకు చెందిన ఈ ద్వీప దేశంలో శుక్రవారం సాయంత్రం తీవ్రమైన భూ కంపం సంభవించడంతో ప్రజల రక్షణార్థం అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు అక్కడి ధికారులు తెలిపారు. ఈ ప్రకంపనల తీవ్రత మరింత ఎక్కువగా ఉండొచ్చని, వరుస ఘటనలు అగ్నిపర్వత విస్ఫోటాలకు దారితీయొచ్చని హెచ్చరించారు.

ఈ మేరకు ఐస్‌లాండ్‌‌‌లోని రెక్జానెస్‌ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం సుమారు 14 గంటల వ్యవధిలో 800 ప్రకంపనలను చవిచూసినట్లు అధికారులు వెల్లడించారు. ఐస్‌లాండ్‌(Iceland) రాజధాని నగరం రెక్జావిక్‌కు 40 కిలోమీటర్ల దూరంలో రెండు బలమైన ప్రకంపనలు సంభవించాయి. వాటి తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై అత్యధికంగా 5.2 గా నమోదైంది. దీంతో సమీప ప్రాంతాల్లో రహదారులు ధ్వంసం కావడంతో రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు.

Also read :ఆ చిన్న కారణంతో రూ.100 కోట్లు పోగొట్టుకున్న చంద్రమోహన్.. ఎందుకో తెలుసా?

ఇదిలావుంటే.. అక్టోబర్ చివరి వారంనుంచి రెక్జానెస్‌ ప్రాంతంలో 24వేల ప్రకంపనలు సంభవించగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు సుమారు 800 ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే గతంలో సంభవించిన ప్రమాదల ఆధారంగా.. ఈసారి కూడా తీవ్రమైన భూ ప్రకంపనల వల్ల ప్రజల రక్షణకోసం అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనల తీవ్రత మరింత ఎక్కువగా ఉండొచ్చని, ఈ వరుస ఘటనలు అగ్నిపర్వత విస్ఫోటాలకు దారితీయొచ్చని హెచ్చరించారు. అంతేకాదు రానున్న రోజుల్లో విస్ఫోటం సంభవించే అవకాశం ఉందని, ఐస్‌లాండ్ వాతావారణ విభాగం అంచనా వేసింది. ప్రస్తుతం భూ ప్రకంపనలు సంభవించిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో గ్రిండావిక్‌ అనే జనావాస ప్రాంతం ఉంది. అక్కడ నాలుగువేల మంది ప్రజలు నివసిస్తుండగా ఈ పరిస్థితుల్లో వారిని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం, ఆస్తి తదితర అంశాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.

Advertisment
తాజా కథనాలు