Tech Employees : 2024లో 80 వేల టెక్ జాబ్స్ హుష్‌కాకి..

2024లో మొదటి నాలుగు నెలల్లో ఏకంగా 80 వేల టెకీల జాబ్స్ ఊడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 279 కంపెనీలకు చెందినవారు ఈ జాబితాలో ఉన్నారని ‘లేఆఫ్.ఎఫ్‌వైఐ నివేదిక పేర్కొంది. మే 3 వరకు మొత్తం 80,230 మంది ఉద్యోగులను ఆయా కంపెనీలు తొలగించాయని పేర్కొంది. 

Tech Employees : 2024లో 80 వేల టెక్ జాబ్స్ హుష్‌కాకి..
New Update

Tech Jobs : ఐటీ రంగం(IT Field) లో ఉద్యోగాల ఉద్వాసనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఏడాది 2024లో మొదటి నాలుగు నెలల్లో ఏకంగా 80 వేల టెకీల జాబ్స్ ఊడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 279 కంపెనీలకు చెందినవారు ఈ జాబితాలో ఉన్నారని ‘లేఆఫ్.ఎఫ్‌వైఐ(layoff.fyi) నివేదిక పేర్కొంది. మే 3 వరకు మొత్తం 80,230 మంది ఉద్యోగులను ఆయా కంపెనీలు తొలగించాయని పేర్కొంది.

ఇటీవల ఉద్యోగులను(Employees) తొలగించిన కంపెనీల జాబితాలో అమెరికా(America) కు చెందిన ‘స్ప్రింక్లర్’, ఫిట్‌నెస్ కంపెనీ ‘పెలోటన్’తో పాటు పలు కంపెనీలు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ చర్యలలో భాగంగా సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కూడా దాదాపు 200 మందిని తొలగించిందని పేర్కొంది. మరోవైపు టెస్లా కూడా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా తన సిబ్బందిలో 10 శాతం మందికి (దాదాపు 14 వేల మంది) ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే.

కాగా 2022, 2023 సంవత్సరాలలో కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున టెకీలు ఉద్యోగాలను కోల్పోయారు. ఈ రెండు సంవత్సరాల్లో కలిపి మొత్తం 4,25,000 ఉద్యోగాలు ఊడాయి. ప్రపంచ ఐటీ రంగంలో మందగమనం, స్టార్టప్ వ్యవస్థలో ప్రతికూల పరిస్థితికి కారణమయ్యాయి.

Also Read : నీట్‌ ఎగ్జామ్ పేపర్ లీక్.. 120మందికి మళ్లీ పరీక్ష!?

#tech-news #it-jobs #big-layoffs #tech-employees-it-sector
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe