Independence Day 2024: మన జాతీయ జెండా ప్రత్యేకత ఇదే.. ప్రపంచంలోనే బెస్ట్!

జాతీయ జెండాను.. 1947 జులై 22న స్వాతంత్ర్య భారతావని కోసం రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ జాతీయ జెండా నాటి నుంచి నేటివరకూ దేశప్రజల గుండెల్లో జాతీయస్ఫూర్తిని రగిలిస్తూనే ఉంది. ఈ జెండా రూపకర్త తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య కావడం విశేషం.

New Update
Independence Day 2024: మన జాతీయ జెండా ప్రత్యేకత ఇదే.. ప్రపంచంలోనే బెస్ట్!

Independence Day 2024: 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దాటిన తరవాత దేశానికి స్వాతంత్య్రం ప్రకటించారు బ్రిటిషర్లు. ఆగస్టు 15 ఉదయం గవర్నర్‌ హౌస్‌మీదా, 16 ఉదయం ఎర్రకోట మీదా భరతజాతి ఆకాంక్షల్ని ప్రతిఫలిస్తూ రెపరెపలాడిన ఆ మువ్వన్నెల పతాకం.. నాటి నుంచి నేటివరకూ దేశప్రజల గుండెల్లో జాతీయస్ఫూర్తిని రగిలిస్తూనే ఉంది. 'విజయ విశ్వ తిరంగా ప్యారా, జండా వూంఛా రహే హమారా' అంటూ ఆనందంగా జెండాను ఎగరేసి వందనం చేయడంతోనే సరిపెట్టకుండా, అందులోని త్రివర్ణాల్ని వినూత్న డిజైన్లలో ధరిస్తూ జాతీయపండగ జరుపుకుంటున్నారు.

పలు మార్పులతో..:

1921లో జరిగిన కాంగ్రెస్​ సమావేశంలో ఒక జెండాను గాంధీజీ (Mahatma Gandhi) ప్రదర్శించారు. దీన్ని తయారుచేసింది మన తెలుగువాడైన పింగళి వెంకయ్య (Pingali Venkayya). ఈ జెండా మూడు సమభాగాలుగా ఉంటుంది. పైభాగంలో తెలుపు, మధ్యలో ఆకుపచ్చ, కింద ఎరుపు రంగు ఉంటాయి. మూడు భాగాలను కలుపుతూ రాట్నం ఉంటుంది. 1931లో జాతీయ పతాకంలో కొన్ని మార్పులు చేశారు. ఇందులో ఎరుపు బదులు కాషాయం వాడారు. దీన్ని పైభాగంలో ఉంచారు. అలాగే తెలుపును మధ్యలోకి, ఆకుపచ్చను కింది భాగంలోకి చేర్చారు. మునుపటి జెండాలో మూడు రంగులను కలుపుతూ ఉన్న రాట్నాన్ని..  కొత్త  జెండాలో కేవలం మధ్యలోని తెలుపు భాగంలో మాత్రమే ఉంచారు. అలాగే రాట్నం డిజైన్​ కూడా మార్చారు.

Independence Day 2024

తెలుగు జాతి ముద్దు బిడ్డ

ఇప్పుడు మనం ఎగరేస్తున్న జాతీయ జెండాను 1947 జులై 22న స్వతంత్ర భారతావని కోసం రాజ్యాంగ సభ ఆమోదించింది. ఇందులో అంతకుముందటి జెండాలోని రంగులు, వాటి స్థానాలను అలాగే  ఉంచారు. మధ్యలో మాత్రం రాట్నానికి బదులు అశోక చక్రం పెట్టారు. ఈ జెండా రూపకర్త మన పింగళి వెంకయ్య మన తెలుగురావు కావడం మనందరికీ గర్వకారణం.

Also Read: Life Style: చల్లని ఆహారంతో ఆరోగ్యానికి హాని.. నిపుణులు ఏం చెబుతున్నారంటే? - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు