Independence Day 2024: నేడు భారత భారత దేశం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగఫలం.. మువ్వన్నెల జెండా ఎగిరిన చారిత్రత్మక ఘట్టం.. అఖండ భారతావని మురిసిన అపురూప క్షణం భారత స్వాతంత్య్ర దినోత్సవం. ఆ రోజున ఎర్ర కోట పై రెపరెపలాడిన ఈ మువ్వన్నెల జెండా నాటి నుంచు నేటి వరకు దేశ ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంది.
దేశ భక్తి గీతాలు
భారత స్వాతంత్ర్యానికి పోరాడిన ఎందరో సమరయోధుల త్యాగఫలాన్ని , స్వాతంత్య్ర ప్రాముఖ్యతను స్మరిస్తూ ఎన్నో దేశ భక్తి గీతాలను రచించారు. 'మేరే దేశ్ కీ ధరి' 'వందేమాతరం' దేశమంటే మట్టి కాదోయ్, సారే జహాన్ సే అచ్ఛా', మా తుజే సలామ్', మేరే వతన్ కే లోగోన్', కదం కదమ్ బధయే జా' వంటి పాటలు దేశ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతాయి. ప్రతి ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఈ దేశ భక్తి గీతాలు ఖచ్చితంగా వినిపిస్తాయి.
మేరే వతన్ కే లోగోన్
చైనా - భారత్ యుద్ధం ముగిసిన అనంతరం రెండు నెలల తర్వాత 1963 జనవరి 27న రాంలీలా మైదాన్‌లో ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ముందు ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఈ పాటను తొలిసారిగా పాడారు. యుద్ధంలో ప్రాణ త్యాగాలు చేసిన భారత సైనికులను స్మరిస్తూ కవి ప్రదీప్ రచించగా, సి రామచంద్ర సంగీతం అందించారు.
'వందేమాతరం'
ఈ పాట శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ నటించిన దేశ భక్తి చిత్రం ఖడ్గం సినిమాలోది. కుల మతాలకు అతీతంగా దేశ ప్రజల ఐక్యతను, దేశభక్తిని చాటేలా ఉంటుంది ఈ పాట .
మా తుజే సలామ్
ఈ పాటను ఏఆర్ రెహమాన్ పాడారు. మాతృభూమి గొప్పతనాన్ని వివరిస్తూ ఈ పాట కంపోజ్ చేయబడింది. ఈ ఆల్బమ్ 1997లో రిలీజయింది. ఇది అతి తక్కువ టీం లో భారతదేశంలో అత్యధికంగా కొనుగోలు చేసిన ఆల్బమ్ గా నిలిచింది.
సారే జహాన్ సే అచ్ఛా
మహాకవి 'సారే జహాన్ సే అచ్ఛా' పాటను రచించారు. లతా మంగేష్కర్ పాడగా పండిట్ రవిశంకర్ స్వరపరిచారు. ఆగష్టు 16, 1904 న ప్రచురించారు.
Also Read: Emergency Trailer: కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' ట్రైలర్..! - Rtvlive.com