గ్రీస్‍లో పడవ బోల్తా.. 78 మంది మృతి

New Update

ఆసియా దేశాల్లో సంక్షోభం, హింస కారణంగా చాలా మంది పొట్టచేత పట్టుకుని యూరప్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఇలా వలసవెళ్లేవారికి గ్రీస్ దేశం యూరప్ యూనియన్‌లోకి గేట్ వేగా మారింది. భారీ గాలులు వీడయంతో పడవ బోల్తా పడింది

గ్రీస్‌లో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 78 మంది మరణించారు. మరి కొంత మంది గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. గ్రీస్ నైరుతి తీరానికి దాదాపు 50 నాటికల్ మైళ్ల దూరంలో పడవ బోల్తా పడిన ప్రాంతంలో కోస్ట్ గార్డులు గాలిస్తున్నారు. ఓ పడవలో లిబియా నుంచి శరణార్థులు ఇటలీ వెళ్తున్న క్రమంలో గ్రీస్ సముద్రతీరంలో పడవ బోల్తా పడింది. గ్రీస్ కోస్ట్ గార్డులు ఇప్పటికి 104 మందిని రక్షించారు.

publive-image

ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 750 మంది ప్రయాణిస్తున్నారు. 104 మందిని రక్షించగా.. 78 మంది ప్రాణాలు కోల్పోయారు. 182 మంది పోను 550 మందికిపైగా గల్లంతనట్లు తెలుస్తోంది. ఈ పడవలో 100 మంది చిన్నారులు కూడా ప్రయాణించినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారు బతికే అవకాశం లేదని కోస్ట్ గార్డులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య 600 దాటే అవకాశం ఉందని ఓ వైద్యుడు తెలిపారు.

మామూలుగా చేపలు పట్టే పడవల్లో 500 నుంచి 700 ప్రయాణిస్తారని ఓ అధికారి తెలిపారు. అయితే ఇలాంటి పడవల్లో ప్రయాణించడం చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో బయటపడిన వారు ఈజిప్టు, సిరియా, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, పాలస్తీనాకు చెందిన పౌరులు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.

ఈ ఘోర ప్రమాదానికి సంతాపంగా గ్రీస్ ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఈ ప్రమాదంలో నెదర్లాండ్స్‌కు చెందిన ఒక సిరియన్ వ్యక్తి తన భార్య, బావ తప్పిపోయినట్లు చెప్పాడు. "అధికారులు సముద్రంలో వారి మృతదేహాలను వెతుకుతున్నారు. వారు ఆస్పత్రులలో చూస్తున్నారు, వారు మృతదేహాల మధ్య, ప్రాణాలతో ఉన్నవారి మధ్య చూస్తున్నారు" అని కస్సం అబోజీద్ అనే వ్యక్తి చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు