70th National Film Awards: కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల విజేతలను ప్రకటించింది. 2022 డిసెంబర్ 30 నాటికి విడుదలైన సినిమాలకు అవార్డులు అందించబడ్డాయి. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సౌత్ సినిమా మెరుపులా మెరిసింది. కన్నడ తారలు, చిత్రాలు అనేక విభాగాల్లో అవార్డులు గెలుచుకొని సత్తాచాటాయి.
ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి
కన్నడ బ్లాక్ బస్టర్స్ కాంతారా, K.G.F: చాప్టర్-2 నాలుగు జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నాయి. 'కాంతారా' సినిమాకు గానూ రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా అవార్డు పొందాడు. కన్నడ చిత్ర పరిశ్రమలో ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు గెలుచుకున్న నాల్గవ యాక్టర్ గా నిలిచారు రిషబ్ శెట్టి. అంతే కాదు కాంతారా ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపికైంది. అలాగే యష్ నటించిన K.G.F: చాప్టర్-2... ఉత్తమ కన్నడ చిత్రంతో సహా ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డును గెలుచుకుంది.
కాంతారా హైలెట్స్
రిషబ్ శెట్టి దర్శకత్వంలో 2022లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. కాంతార అనేది సంస్కృత పదం. తెలుగులో అడవి అని అర్థం. ప్రకృతి పట్ల ఎంత విద్వేషం ప్రదర్శిస్తే అంతకు మించిన విధ్వంసం జరుగుతుందని ఈ మూవీలో చూపించారు. ఈ సినిమా కథ దక్షిణ కర్ణాటకలోని ఒక అందమైన ప్రాంతంలో జరుగుతుంది.
రిషబ్ శెట్టి నటన
ఈ సినిమాకు హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించారు. ఇందులో రిషబ్ శెట్టి నటన ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది. ఆయన స్క్రీన్ ప్రజెన్స్, హావభావాలు, యాక్షన్ సన్నివేశాలు, పాత్రలో ఆయన ఒదిగిన తీరు, కాస్ట్యూమ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. రిషబ్ నటన దేశవ్యాప్తంగా సినీ ప్రియులను ఫిదా చేసింది.
దేశీయ సంస్కృతులు
ఈ సినిమాలో కథానుగుణంగా సినిమాలో కర్నాటక సంస్కృతిక కళలు , భూత కోల, దైవారాధన, నాగారాధన వంటి దేశీయ సంస్కృతులను నైపుణ్యంగా ఉపయోగించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మ్యూజిక్
ఈ చిత్రంలో అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ మరింత హైలెట్ గా నిలిచింది. సినిమాలోని కీలక సన్నివేశాల్లో బీజీఎమ్ సినీ లవర్స్ ను మైమరిపించింది.
హోల్ సమ్ ఎంటర్ టైనర్
దేశీయ సంస్కృతులు, ఆచారాలు, ప్రకృతి పరిరక్షణ, మూఢనమ్మకాలు వంటి అనేక అంశాలను నేర్పుగా అల్లిన ఈ చిత్రం అత్యంత ప్రేక్షకాదరణ పొందింది. అంతర్జాతీయంగా సినీ విశ్లేషకులు, విమర్శకుల ప్రశంశలు అందుకుంది.
మరో రెండు కన్నడ చిత్రాలు
కాంతారాతో పాటు మరో రెండు కన్నడ చిత్రాలు అవార్డులు గెలుచుకున్నాయి. బెస్ట్ ఆర్ట్స్ / కల్చర్ ఫిల్మ్ గా 'రంగ విభోగ', 'ఇంటర్‌మిషన్' చిత్రానికి గానూ బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ గా బస్తి దినేశ్ షెనోయ్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటిగా తిరుచిత్రంబలం చిత్రానికి నిత్యా మీనన్, కచ్ ఎక్స్‌ప్రెస్ సినిమాకు మాన్సీ పరేఖ్ అవార్డులు అందుకున్నారు. మలయాళ చిత్రం 'ఆట్టం' ఉత్తమ చిత్రం అవార్డును కైవసం చేసుకుంది.
Also Read:70th National Film Awards: 'కార్తికేయ 2' నేషనల్ అవార్డు పై హీరో నిఖిల్ రియాక్షన్ - Rtvlive.com