High Security in Ayodhya Ram Mandir : అయోధ్య(Ayodhya)లో అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకకు మరో రోజే మిగిలి ఉండడంతో నగరం ఏడంచెల భద్రతతో కోటలా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరాన్ని అలంకరించగా, భద్రతా బలగాలు కూడా కట్టుదిట్టం చేశాయి. నగరంలో సాధువులు తరలిరాగా, హైదరాబాద్(Hyderabad) లో సిద్ధం చేసిన 1265 కిలోల లడ్డూ(1265 Kg Laddu) ఇప్పుడు అయోధ్యకు చేరుకుంది. అలాగే, 400 కిలోల బరువున్న ప్రపంచంలోనే అతిపెద్ద తాళం అలీఘర్ నుంచి అయోధ్యకు చేరుకుంది. జనవరి 22న జరగనున్న అయోధ్యలోని రామమందిరం 'ప్రాణ్‌ప్రతిష్ఠ' వేడుక కోసం చండీగఢ్ 150 క్వింటాళ్ల లడ్డూలను సిద్ధం చేస్తోంది.
వివిధ దేశాల నుంచి అతిథులు:
జనవరి 22న రామజన్మభూమి ఆలయంలో జరిగే రామ్‌లల్లాకు (Ram Lalla) పట్టాభిషేక కార్యక్రమానికి 54 దేశాల నుంచి మొత్తం 100 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల నుంచి ప్రభుత్వ ప్రతినిధులకు రామమందిరం ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. మారిషస్, ఆఫ్రికా దేశాలు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అదనంగా, అతిథి జాబితాలో 506 మంది రాష్ట్ర అతిథులు ఉన్నారు.
ఏడంచెల భద్రతా:
మొదటి మూడు వలయాల్లో SPG కమాండోలు, NIA, IPS అధికారులు ఉంటారు. CRPF, ATS, IB, స్థానిక పోలీసు సిబ్బంది సెక్యూరిటీతో అయోధ్యలో చిమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది. 10 వేల సీసీటీవీ కెమెరాలతో పాటు సరయూ నదీ తీరంలో ఫ్లోటింగ్ స్క్వాడ్లు ఉంటాయి. గగనతలం పహారా కోసం డ్రోన్లు, వైమానిక దాడులను ఎదుర్కొనేందుకు యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉంటుంది. అటు అయోధ్య భద్రత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని కూడా ఉపయోగిస్తున్నారు. ఆరు కంపెనీల CRPF, మూడు కంపెనీల PAC, 9 కంపెనీల SSF, ATS, STF యూనిట్‌తో పాటు 1,500 మంది పోలీసు అధికారులు విధుల్లో ఉంటారు. 47 మంది అగ్నిమాపక సిబ్బంది, 2 బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ టీమ్స్ కాపు కాస్తాయి. అటు ప్రధాని మోదీకి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఉండనున్నాయి. డీఐజీ-3, ఎస్పీలు-17, ఏఏస్పీలు-40, డీఎస్పీలు-82, ఇన్‌స్పెక్టర్లు-90, కానిస్టేబుళ్లు-1000తో ప్రధాని కోసం భారీ భద్రతా ఏర్పాటు చేశారు.
Also Read: రేవంత్ రక్తం అంతా బీజేపీదే.. ఇక్కడ చోటా మోడీగా మారిండు: కేటీఆర్
WATCH: