66 లక్షల వాట్సాప్ ఖాతాలపై మెటా నిషేధం..! మెటా యాజమాన్యంలోని వాట్సాప్ జూలై 1న ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది.దేశంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు 66 లక్షల ఖాతాలను నిషేధించామని..వాటిలో ముందు జాగ్రత్తగా 12లక్షలు 55వేల ఖాతాలను తొలగించినట్టు ఓ ప్రకటనలో తెలపింది. By Durga Rao 04 Jul 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి దేశంలోని చట్టాలను ఉల్లంఘించినందుకు మే నెలలో భారతదేశంలో 66 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించినట్లు మెటా యాజమాన్యంలోని వాట్సాప్ తెలిపింది .వీటిలో ముందు జాగ్రత్త చర్యగా 12 లక్షల 55 వేల ఖాతాలను తొలగించినట్టు వాట్సప్ పేర్కొంది.భారతదేశంలోని గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ నుండి 11 ఆర్డర్‌లను అందుకుంది. గత ఏప్రిల్‌లో భారత్‌లో 71 లక్షల వాట్సాప్ ఖాతాలను నిషేధించడం గమనార్హం. మార్చిలో వాట్సాప్‌కు అందిన 1054 ఫిర్యాదుల నివేదికల్లో కేవలం 11 ఫిర్యాదుల పై మాత్రమే “చర్యలు తీసుకున్నట్లు” రికార్డుల్లో పేర్కొంది.వాట్సాప్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, విశ్లేషకులు, పరిశోధకులు, చట్ట అమలు నిపుణులు, ఆన్‌లైన్ సెక్యూరిటీ, టెక్నాలజీ డెవలపర్‌ల బృందాన్ని నియమించింది. “వేధించే పరిచయాలను తక్షణమే బ్లాక్ చేయమని, అప్లికేషన్‌లోని అటువంటి కంటెంట్‌ను నివేదించమని మేము వినియోగదారులను ప్రోత్సహిస్తూనే ఉన్నామని వాట్సప్ తెలిపింది. "మేము అదనపు జాగ్రత్తతో యూజర్ ఫీడ్‌బ్యాక్‌ను పర్యవేక్షిస్తు న్నామని సాధ్యమైనంతవరకు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని WhatsApp పేర్కొంది. #meta-ai-on-whatsapp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి