/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Telangana-Polycet.jpg)
TS POLYCET 2024 Counselling:తెలంగాణ వ్యాప్తంగా శనివారం పాలిసెట్ పరీక్షలో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. వివిధ పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 32 హెల్ప్‌లైన్ కేంద్రాలను సాంకేతిక ఏర్పాటు చేసినట్టు విద్యాశాఖ పేర్కొంది.
కౌన్సెలింగ్ కేంద్రాల్లో తొలి రోజు 5,760 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. వివిధ పాలిటెక్నిక్‌లలో అడ్మిషన్ల కోసం 911మంది అభ్యర్థులు మొదటిరోజు ఆన్‌లైన్‌లో ఆప్షన్లను పెట్టుకున్నారని, గరిష్ఠంగా ఒక అభ్యర్థి 134 ఆప్షన్లు ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 25వరకు ధ్రువపత్రాల పరిశీలన, 27వరకు ఆప్షన్లకు అవకాశం ఉండనున్నట్లు తెలిపారు. 30న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ఉంటుందని చెప్పారు.