Cancer Foods : 'ఆర్గానిక్' ఫుడ్ లోనూ క్యాన్సర్ కారకాలు.. మొత్తం 527 ఐటెమ్స్.. షాకింగ్ రిపోర్ట్!

భారతదేశంలో పండించే ఆహార పదార్థాల్లో క్యాన్సర్ ను ప్రేరేపించే రసాయనాలున్నట్లు యూరోపియన్ యూనియన్‌లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఆర్గానిక్ లేబుల్ కలిగివున్న ధాన్యాలు, పండ్లతోపాటు మొత్తం 527 పదార్థాల్లో క్యాన్సర్ కు కారణమయ్యే ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు కనుగొన్నారు.

New Update
Cancer Foods : 'ఆర్గానిక్' ఫుడ్ లోనూ క్యాన్సర్ కారకాలు.. మొత్తం 527 ఐటెమ్స్.. షాకింగ్ రిపోర్ట్!

Cancer : భారతదేశం(India) లో పండించే ఆహార పదార్థాల్లో(Food Products) క్యాన్సర్ ను ప్రేరేపించే రసాయనాలున్నట్లు యూరోపియన్ యూనియన్‌(European Union) లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఆర్గానిక్ లేబుల్ కలిగివున్న ధాన్యాలు, పండ్లలోతో పాటు మొత్తం 527 పదార్థాల్లో క్యాన్సర్ కు కారణమయ్యే ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు కనుగొన్నారు.

నువ్వుల్లోనూ క్యాన్సర్ కారకాలు..
ఈ మేరకు ఇథిలీన్ ఆక్సైడ్ కలిగిన గింజలు నువ్వుల్లోనూ క్యాన్సర్ కారకాలను కనుగొన్నట్లు వెల్లడించారు. అలాగే మూలికలు, సుగంధ ద్రవ్యాలతోపాటు పలు పదార్థాలతో కలిపి 313 కేసులను గుర్తించినట్లు పేర్కొన్నారు. సెప్టెంబరు 2020 నుంచి 2024 ఏప్రిల్ మధ్య ఉత్పత్తి అయిన డైటిక్ ఫుడ్స్‌లో 48 శాతం కలుషితాలున్నట్లు తెలిపారు. ఇతర ఆహార ఉత్పత్తులతో 34 శాతం ఉన్నట్లు రాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్(RASFF) డేటా రిలీజ్ చేసింది.

ఇది కూడా చదవండి: Pawan kalyan: ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన పవన్.. కొణిదెల ఫ్యామిలీ నుంచి అకీరా-ఆద్యలు ఔట్!

'ఆర్గానిక్' లేబుల్ చేయబడిన ఉత్పత్తుల్లోనూ..
వీటిలో 54 'ఆర్గానిక్'(Organic Food) అని లేబుల్ చేయబడిన ఉత్పత్తుల జాబితాను పరిశీలిస్తే.. గింజలు, నువ్వులు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, నేరుగా తినే ఆహారాలు, ఇతర ఆహార ఉత్పత్తులున్నాయి. ఇక నువ్వులు, ఎండుమిర్చి, అశ్వగంధ వంటి వస్తువులు ఇథిలీన్ ఆక్సైడ్ కలిగి ఉన్నప్పటికీ వాటికి 'సేంద్రీయ' అని లేబుల్ చేయబడ్డాయని తెలిపారు. కొన్ని ఉత్పత్తులు 'ప్రీమియం రోగనిరోధక శక్తిని పెంచేవి'గా పేర్కొంటూ లేబుల్‌లతో వచ్చాయి. నివేదిక ప్రకారం 87 సరుకులు సరిహద్దు వద్ద పూర్తిగా తిరస్కరించబడ్డాయి. మిగిలిన వాటిలో చాలా వరకు మార్కెట్ల నుంచి తొలగించబడ్డాట్లు RASFF తెలిపింది. అలాగే 2020-21లో భారతదేశంతో సహా అనేక దేశాల నుంచి దిగుమతి చేసుకున్న 468 వస్తువులలో ఇథిలీన్ ఆక్సైడ్ కాలుష్యం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు