/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-07T162123.453.jpg)
జమ్మూకశ్మీర్‌లోని వివిధ జిల్లాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోయాయి.జమ్మూకశ్మీర్‌లోని ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక సైనికుడు గాయపడ్డాడు.అంతకముందు కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదుల కదలికలపై భద్రతా బలగాలకు సమాచారం అందటంతో. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు.ఈ ఘటనలో ఇద్దరు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
రాజౌరి జిల్లాలోని ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయగా. ఒక సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు.వారికి భద్రతా బలగాలు కూడా ధీటుగా బదులిచ్చాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు, పోలీసులు గాలిస్తున్నారు.