Building Collapsed: కుప్పకూలిన 5 అంతస్తుల భవనం...ఇద్దరు మృతి.. శిథిలాల కింద ఇంకా!

కోల్‌కతాలోని మెటియాబ్రూజ్‌లో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 15 మంది సురక్షితంగా బయటపడ్డారు. కోల్‌కతాలో ఆదివారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది.

New Update
Building Collapsed: కుప్పకూలిన 5 అంతస్తుల భవనం...ఇద్దరు మృతి.. శిథిలాల కింద ఇంకా!

కోల్‌కతాలోని మెటియాబ్రూజ్‌లో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 15 మంది సురక్షితంగా బయటపడ్డారు. కోల్‌కతాలో ఆదివారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు

గార్డెన్ రీచ్ ప్రాంతంలోని హజారీ మొల్లా బగన్‌లో ఆదివారం అర్ధరాత్రి ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ సంఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

భవనం కూలిపోయిన ప్రదేశానికి దగ్గరలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు స్థానికులు అధికారులకు వివరించారు. ఈ అక్రమ నిర్మాణాలన్నీ కూడా ఇక్కడ ఉన్న స్థానిక అధికారికి తెలిసే జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కూలిపోయిన భవనం కూడా అక్రమంగా నిర్మిస్తుందే అని వారు తెలిపారు.

కూలిన భవనం శిథిలాల కింద చాలా మంది కూరుకుపోవడంతో వారంతా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న కోల్‌కతా పోలీసులు, అగ్నిమాపకదళం బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్‌ లో అధికార యంత్రాంగంతో పాటు స్థానికులు కూడా శిథిలాలలను తొలగించే పనిలో ఉన్నారు.

ఇప్పటికే భవనం కింద నుంచి సుమారు 15 మందిని రక్షించి సమీపంలోని కలకత్తా మెడికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ లో చేర్చారు. తీవ్రంగా గాయపడిన వారిలో 2 మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.

Also read: ఎన్నిసార్లు మీరే అవుతారు మావా.. మరోసారి పుతినే ప్రెసిడెంట్‌!

Advertisment
తాజా కథనాలు