Exit polls: 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్‌దే హవా..! మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ గెలుస్తుందని పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే చెబుతోంది. రాజస్థాన్‌లో మాత్రం బీజేపీ గెలుస్తుందని అంచనా వేస్తోంది. అటు మిజోరాంలో MNF అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. By Trinath 30 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోని రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే చెబుతోంది. రాజస్థాన్‌లో మాత్రం బీజేపీకి లీడ్ ఇచ్చింది పీపుల్స్ పల్స్ సంస్థ. అటు మిజోరంలో MNFకి 20 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ అంచనా వేస్తోంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 నియోజకవర్గాలు ఉండగా.. బీజేపీ 91-113 వరకు సీట్లు సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే చెబుతోంది. అదే సమయంలో కాంగ్రెస్‌కు 117-139 సీట్లు సాధించి ప్రభుత్వం ఫామ్ చేస్తోందని చెబుతోంది. రాజస్థాన్‌లో మాత్రం బీజేపీదే పైచేయిగా కనిపిస్తోంది. రాజస్థాన్‌లో మొత్తం నియోజకవర్గాలు 200 ఉండగా బీజేపీ 99-115 స్థానాల్లో గెలుస్తుందని.. కాంగ్రెస్ 73-95 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెబుతోంది. ఈ లెక్కన రాజస్థాన్‌లో బీజేపీదే అధికారమని పీపుల్స్ సర్వే అంచనా వేస్తోంది. మీజొరాంలో ZPM విన్ అవుతుందంటున్న చాణక్య సర్వే అటు సీఎన్‌ఎన్-న్యూస్-18 ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ 108 స్థానాల్లో గెలుస్తుందని.. బీజేపీ 119 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని అంచనా వేస్తోంది. అటు 90స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 47 ఓట్లు సాధిస్తుందని చెబుతోంది. ఇక 199 స్థానాలున్న రాజస్థాన్‌లో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో విజయం సాధిస్తుందని సీఎన్‌ఎన్-న్యూస్18 సర్వే చెబుతోంది. బీజేపీకి 119 సీట్లు వస్తాయని అంచనావేస్తోంది. ఇండియా టూడే సర్వేలో హంగ్: ఇటు ఇండియా టూడే(India Today) ఎగ్జిట్ పోల్స్‌లో మధ్యప్రదేశ్‌లో హంగ్ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో బీజేపీకి 106-116 స్థానాలు వచ్చే అవకాశం ఉందని.. కాంగ్రెస్‌కు 111-121 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని అంచనా. ఇక రాజస్థాన్‌లో కూడా కాంగ్రెస్ కు లీడ్ వస్తుందని చెబుతోంది. 199స్థానాలున్న రాజస్థాన్‌లో బీజేపీకి 90 సీట్లు వస్తాయని కాంగ్రెస్‌కు 96 సీట్లు వస్తాయని ఇండియాటూడే ఎగ్జిట్ పోల్ చేబుతోంది. అటు 90స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి 36-46సీట్లు వస్తాయని.. కాంగ్రెస్‌కు 40-50సీట్లు గెలుచుకుంటుందని ఇండియాటూడే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తోంది. Also Read: తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్సే.. తేల్చి చెబుతున్న ఎగ్జిట్ పోల్స్..! #5-state-elections-2023 #exit-poll-survey మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి