Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం

TG: హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్ బేబీలాన్, శేరిలింగంపల్లి కోరమ్ క్లబ్‌లో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 37మందికి డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించగా.. అందులో నలుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌గా తేలింది. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం
New Update

Hyderabad Drugs: హైదరాబాద్‌ పబ్స్‌లో మరోసారి ఎక్సైజ్ అధికారుల దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లిలోని 5 పబ్‌లలో తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ బేబీలాన్, శేరిలింగంపల్లి కోరమ్ క్లబ్‌లో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. 37 మందికి డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించగా.. అందులో నలుగురికి డ్రగ్స్‌ పాజిటివ్ గా తేలింది. డ్రగ్స్ ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు? అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.

డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిలో వరంగల్ కు చెందిన చిన్న నిగేష్, శ్రీకాకుళం కి చెందిన నార్త్ రవికుమార్, మూసాపేటకు చెందిన టీవీఎస్ కేశవరావు, చార్మినార్ కు చెందిన అబ్దుల్ రహీమ్ ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో తరచుగా డ్రగ్స్ పట్టుపడడం కలకలం రేపుతోంది. ఇప్పటికే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని, డ్రగ్స్ తీసుకున్న, సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించినా.. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. అక్రమార్కులు మాత్రం ఆగడం లేదు.

#hyderabad-drugs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe