Hair Fall : శరీరంలో ఇవి లోపిస్తే.. మీ జుట్టు రాలడం ఖాయం

ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం అనేది పెద్ద సమస్యగా మారింది. పోషకాహార లోపాలు,జీవన శైలి విధానాలు దీనికి ఎక్కువగా కారణమవుతున్నాయి. ముఖ్యంగా శరీరంలో ఐరన్, జింక్, మెగ్నీషియం, సెలీనియం, కాపర్ వంటి మినరల్స్ లోపం జుట్టు రాలే సమస్యను మరింత తీవ్రం చేస్తాయి.

New Update
Hair Fall : శరీరంలో ఇవి లోపిస్తే.. మీ జుట్టు రాలడం ఖాయం

Hair Fall Tips : ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం(Hair Fall) అనేది పెద్ద సమస్యగా మారింది. పోషకాహార లోపాలు, జీవన శైలి(Life Style) విధానాలు దీనికి ఎక్కువగా కారణమవుతున్నాయి. ముఖ్యంగా శరీరంలో ఐరన్, జింక్, మెగ్నీషియం, సెలీనియం, కాపర్ వంటి మినరల్స్ లోపం జుట్టు రాలే సమస్యను మరింత తీవ్రం చేస్తుంది.

Also Read: Save The Tigers Series: ఓటీటీలో ‘సేవ్‌ ది టైగర్స్‌’ హవా .. ఇండియాలోనే టాప్ 3 సీరీస్ గా రికార్డు..!

ఐరన్

ఐరన్(Iron) లోపం లేదా రక్త హీనత జుట్టు రాలడం, ఇతర సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో తగినంత ఇనుము ఉండడం ద్వారా జుట్టు కుదుళ్లకు సరిపడ ఆక్సీజన్ అందుతుంది. ఇది జుట్టు పెుగుదల, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

జింక్

జింక్ జుట్టును దృఢంగా తయారు చేస్తుంది. అలాగే జుట్టును డ్యామేజ్ నుంచి రక్షించి ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడును. డైలీ డైట్(Daily Diet) లో జింక్ పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.

సెలీనియం

దీనిలో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్ళను డ్యామేజ్ , ఫ్రీ రాడికల్స్ ఒత్తిడి నుంచి కాపాడతాయి. అలాగే జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ఎంజైమ్స్ ఉత్పత్తికి తోడ్పడతాయి. శరీరంలో ఈ పోషకం లోపించినప్పుడు జుట్టు రాలే సమస్య తీవ్రం అవుతుంది.

కాపర్
కాపర్ జుట్టుకు రంగును ఇచ్చే మెలనిన్ అనే కంపౌండ్ ను ఉత్పత్తి చేయడానికి సహాయడుతుంది. అలాగే శరీరంలో ఇనుము శోషణను మెరుగుపరిచి.. జుట్టు ఆరోగ్యాన్ని, ఆకారాన్ని సక్రమంగా నిర్వహిస్తుంది.

మెగ్నీషియం

మెగ్నీషియం జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ఎన్నో రసాయన చర్యల్లో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఉదాహరణకు ప్రోటీన్ సింథసిస్, సెల్యులార్ మెటబాలిజం. శరీరంలో దీని లోపం కారణంగా జుట్టు రాలే సమస్యకు దారి తీస్తుంది.

Also Read: Kumari Aunty: కుమారి ఆంటీ మెడలో స్వర్ణ హారం.. ధర తెలిస్తే మైండ్ బ్లాకే..!

Advertisment
తాజా కథనాలు