Millets: ఈ మధ్య కాలంలో చిరుధాన్యాలు(Millets) ఆరోగ్య రిత్యా ఎక్కువ ప్రాధాన్యం పొందాయి. మిల్లెట్స్ లో అధికంగా ఉండే ఫైబర్, ప్రోటీన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డయేరియా, మలబద్దకం, కడుపు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలకు కారణమైన గ్లూటెన్ శాతం వీటిలో ఉండదు. అందుకే వీటిని ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు.
మిల్లెట్స్ తో రకరకాల స్నాక్స్, పిండివంటలు, స్వీట్స్, ఇలా రుచికరమైన ఎన్నో పదార్థాలను తయారు చేసుకోవచ్చు. ఇవి రుచి గా మాత్రమే కాదు పుష్కలమైన పోషకాహారాలను కలిగి ఉంటాయి. తినే ఆహరం, ఆరోగ్యం, పై మరింత శ్రద్ధ పెడుతున్న ఈ రోజుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు కలిగిన ఈ చిరుధాన్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
చిరుధాన్యాలలో ఎన్నో రకాలు ఉంటాయి.. వాటన్నింటిలో నుంచి అన్ని రకాల వంటకాలకు, ఆరోగ్యానికి ఉపయోగపడే చిరుధాన్యాల గురించి తెలుసుకుందాం..
చిరుధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలు..
- చిరుధాన్యాలలోని 'ఫైటోన్యూట్రియెంట్' క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యల నుంచి కాపాడుతాయి. అలాగే ఇవి అధిక మోతాదులో యాంటియోక్సిడెంట్స్ ను కలిగి ఉంటాయి
- వీటిలోని ఫైబర్ గుణాలు జీర్ణక్రియకు(Digestion) సహాయపడతాయి దాంతో పాటు బరువు, కొలెస్ట్రాల్ తగ్గగించడంలో తోడ్పడుతుంది.
- మిల్లెట్స్ గ్లూటెన్ ఫ్రీ ఉన్నందున వాటిని తింటే అవి పేగు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
- వీటిని మన ఆహారంలో అలవాటు చేసుకోవడం వల్ల ఇవి కిడ్నీ, లివర్ కు హాని కలిగించే విషపూరిత పదార్థాలను బయటకు పంపిస్తాయి.
సజ్జలు (Bajra)
మినరల్స్ , యాంటియోక్సిడెంట్స్,(Anti oxidants) ప్రోటీన్స్ అధికంగా కలిగి ఉంటాయి. మధుమేహం ఉన్న వారికీ ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంలో అలవాటు చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. వీటితో రుచికరమైన పరాటా, చీలా, దోస చేసుకోవచ్చు.
అరికెలు (Kodo millet)
ఇవి ఫైబర్, ఐరన్ శాతాన్ని కలిగి ఉంటాయి. వీటిలోని ఫైబర్ గుణాలు మలబద్దకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. రక్తంలోని చక్కర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది.
జొన్నలు(Jowar)
వీటిలో నెమ్మదిగా జీర్ణమయ్యే పిండి పదార్థం(starch) ఉంటుంది. దాని వల్ల ఆహార శోషణ నెమ్మదిగా ఉంటుంది దాంతో చాలా సేపటి వరకు పొట్ట నిండుగా ఉన్న భావనను ఇస్తుంది. అలాగే ఇవి రక్తంలోని చెక్కర స్థాయిలు పెరగకుండా కాపాడతాయి.
కుట్టు (buckwheat)
వీటిలో పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్, కాల్షియం, వంటి పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చటం వల్ల బరువు తగ్గడంలో సహకరిస్తాయి.
రాగులు(Ragi)
ఎముకలను దృడంగా ఉంచడానికి రాగులు మంచి ఎంపిక వీటిలోని ఐరన్, క్యాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే వీటిలోని యాంటియోక్సిడెంట్స్ జీవన శైలి వ్యాధుల నుంచి కాపాడుతాయి. రాగులతో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు రోటీ, బిస్కెట్స్, కేక్, కుకీస్..
Also Read: Health Tips: ఈ ఐదు పండ్లు తింటే రోగాలు పరార్.. అవేంటంటే?