Telangana: మళ్లీ రెచ్చిపోతున్న కుక్కలు.. ఒక్కరోజే 44 మందిపై దాడి!

తెలంగాణ వ్యాప్తంగా కుక్కలు మళ్లీ రెచ్చిపోతున్నాయి. ఒక్క రోజే బాసర ఆలయం దగ్గర 30 మందిని, హైదరాబాద్ లో 14 మందిని కరిచాయి. పలువురికి తీవ్ర గాయాలవగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

New Update
Telangana: మళ్లీ రెచ్చిపోతున్న కుక్కలు.. ఒక్కరోజే 44 మందిపై దాడి!

Dog bite: తెలంగాణలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వీధుల్లో స్వైర విహారం చేస్తూ.. వచ్చిపోయేవారిపై దాడి చేస్తూ గజగజా వణికిస్తున్నాయి. బుధవారం ఒక్క రోజే రాష్ర్ట వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుక్కలు పలువురిపై దాడి చేశాయి. మరి ముఖ్యంగా బాసర సరస్వతి దేవాలయం సమీపంలో కుక్కల దాడిలో 30 మంది భక్తులు గాయపడగా, హైదరాబాద్ లో 14 మంది గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రులకు తరలించారు.

15 మందిపై దాడి..
వసంత పంచమి సందర్భంగా బాసరకు ఓవైపు భక్తులు పోటెత్తుతుంటే.. మరోవైపు వారిపై కుక్కలు రెచ్చిపోయాయి. కనిపించిన వారిపై దాడి చేస్తూ రక్తం కళ్ల చూశాయి. మంగళవారం అర్ధరాత్రి పూట ఓ లాడ్జ్ దగ్గర ఉన్న నలుగురిని కుక్కలు కరిచాయి. ఆ తర్వాత మరో 11 మందిపై దాడి చేశాయి. క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏకంగా 15 మందిని కుక్కలు కరవటంతో భక్తులంతా వణికిపోతున్నారు. ఆ తర్వాత కూడా మరో 15 మందిపై కుక్కలు దాడి చేశాయి. కాగా గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా వారిలో సీరియస్ గా ఉన్నవారిని నిజామాబాద్ ఏరియా ఆసుపత్రి, హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు. కాగా దీనిపై స్పందించిన గ్రామ పంచాయతీ సిబ్బంది కొన్ని కుక్కలను బంధించి దూరంగా వదిలివేయగా, మరికొన్నింటిని దూరంగా తరిమేశారు.

ఇది కూడా చదవండి : CRIME: కాలిఫోర్నియాలో విషాదం.. ఇండో-అమెరికన్ ఫ్యామిలీ అనుమానస్పద మృతి

హైదరాబాద్ లో పిచ్చి కుక్క..
రాజేంద్ర నగర్ పరిధిలోని పోచమ్మ ఆలయం దగ్గర చాయ్ అమ్ముకుంటున్న రమేష్(35)తో పాటు అక్కడే ఆడుకుంటున్న కౌశిక్‌ కుమార్‌(4)పై పిచ్చి కుక్క దాడి చేసింది. స్థానికులు తరమటంతో.. అక్కడి నుంచి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌(నార్మ్‌) మెయిన్‌ గేటు దగ్గరికి వెళ్లి అక్కడ విధులు నిర్వహిస్తోన్న సెక్యూరిటీ సిబ్బందిని కరిచింది. మళ్లీ అక్కడి నుంచి వెళ్లగొట్టటంతో మళ్లీ పోచమ్మ దేవాలయం వీధిలోకి వచ్చిన కుక్క ఆ దారి వెంట వెళ్తున్న ఎస్కే సింగ్‌, రామకృష్ణ, రమేశ్‌, శరత్‌ కుమార్‌, చెన్నయ్య, మల్లిక, ఆండాలు, నరేందర్‌, రాజ్‌వీర్‌, యాదగిరి, జాకీర్‌, రంగన్న, కౌశిక్‌ కుమార్‌, రాజును కరిచింది. వీళ్లందరికీ రాజేంద్రనగర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌‌లో చికిత్స అందిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు