/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/yogesh-jpg.webp)
గుండెపోటుకి వయసుతో సంబంధం లేకుండా ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో ఈ మరణాలు మరీ ఎక్కువ అయిపోయాయి. తాజాగా '' మిస్టర్ తమిళనాడు'' (Mister Tamilanadu)టైటిల్ విజేత, ప్రముక బాడీ బిల్డర్ యోగేశ్(41) గుండెపోటుతో మరణించారు.
దీంతో ఆయన కుటుంబంతో పాటు అభిమానుల్లో కూడా తీవ్ర విషాదం నెలకొంది. చెన్నైలోని అంబత్తూరు మేనంపేడులోని మహాత్మగాంధీ వీధిలో యోగేశ్ నివాసిస్తున్నాడు. బాడీ బిల్డర్ గా యోగేశ్ అనేక పోటీలలో పాల్గొని ఎన్నో పతాకాలు కూడా సాధించాడు. 2021లో 9 కి పైగా మ్యాచుల్లో పాల్గొని విజయం సాధించాడు.
Also read: 12 గంటల పాటు రాళ్ల గుట్టల్లో యువతి నరకయాతన!
ఈ క్రమంలోనే బాడీ బిల్డింగ్లో మిస్టర్ తమిళనాడు అవార్డును కూడా అందుకున్నాడు. అయితే 2021లో వైష్ణవి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. తరువాత పాప పుట్టడంతో రెండు సంవత్సరాల పాటు బాడీ బిల్డింగ్ కి దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఓ జిమ్ లో ట్రైనర్గా పని చేస్తున్నాడు.
పనిచేస్తున్న జిమ్ నుంచి శిక్షణ అనంతరం ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇంటికి వెళ్లే ముందు యోగేశ్ వాష్ రూంకి వెళ్లగా అక్కడ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. యోగేశ్ ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కంగారు పడిన యువకులు వెళ్లి చూడగా లోపల యోగేశ్ అపస్మారక స్థితిలో ఉన్నాడు.
Also read: ఘోర రోడ్డు ప్రమాదం..రెండు లారీల మధ్య నుజ్జయిన కారు..ఏడుగురి మృతి!
దీంతో అక్కడ ఉన్న వారు యోగేశ్ ను స్థానిక కిల్పౌక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యోగేశ్ ని పరీక్షించిన వైద్యులు..అప్పటికే అతను మృతి చెందినట్లుగా నిర్థారించారు. గుండె పోటుతో యోగేశ్ చనిపోయినట్లు తెలిపారు. పెళ్లి తర్వాత యోగేశ్ బాడీ బిల్డింగుకు విరామమిచ్చి పెద్దగా బరువులు ఎత్తడం లేదు. తక్కువ బరువులు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ బరువులు ఎత్తడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు చెబుతున్నారు.