Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 35 విమానాలు రద్దు

మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక లోపం కారణంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 35 విమానాలను రద్దు చేశారు అధికారులు. ఎయిర్‌పోర్టులో డిస్‌ప్లే బోర్డులు పనిచేయకపోవడంతో మాన్యువల్ బోర్డులు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ప్రధాన ఎయిర్‌పోర్టులన్నింటిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

New Update
Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 35 విమానాలు రద్దు

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటివరకూ 35 విమానాలను రద్దు చేశారు అధికారులు. ఎయిర్‌పోర్టులో డిస్‌ప్లే బోర్డులు పనిచేయకపోవడంతో మాన్యువల్ బోర్డులు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ప్రధాన ఎయిర్‌పోర్టులన్నింటిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా విండోస్‌ సేవల్లో అంతరాయంతో విమాన సేవలకు బ్రేక్ పడింది. టికెట్ల బుకింగ్‌, చేకిన్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులకు మాన్యువల్‌గా సేవలు అందిస్తున్నారు ఎయిర్‌పోర్టు సిబ్బంది.

publive-image బోర్డింగ్‌ను మాన్యువల్‌గా చేస్తన్న ఎయిర్ పోర్ట్ సిబ్బంది

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ దెబ్బ..

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలు నిలిచిపోయాయి. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు రీస్టార్ట్ అవుతూ బ్లూ స్క్రీన్ ఎర్రర్ వస్తోంది. దీని కారణంగా ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విమాన సేవలు, బ్యాంకు సేవలకు స్తంభించాయి. విండోస్​ పనిచేయడం లేదని సోషల్​ మీడియాలో పోస్ట్​లు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈరోజు ఉదయం నుంచి ఈ సమస్యను ఎదురుకుంటున్నట్లు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య కారణంగా అమెరికాతో పాటు వివిధ దేశాల్లో విమాన సేవలు నిలిచిపోయాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు