35-Chinna Katha Kaadu: ''అంతా సున్నా వల్లే వచ్చింది''... ఆసక్తికరంగా '35 – చిన్న కథ కాదు' ట్రైలర్

ప్రియదర్శి- నివేతా థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ '35 – చిన్న కథ కాదు'. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో నివేతా సరస్వతి అనే గృహిణీ పాత్రలో కనిపించనున్నట్లు చూపించారు. ఒక కుటుంబం చుట్టూ సాగే కథాంశంతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

New Update
35-Chinna Katha Kaadu: ''అంతా సున్నా వల్లే  వచ్చింది''...  ఆసక్తికరంగా '35 – చిన్న కథ కాదు' ట్రైలర్

35-Chinna Katha Kaadu: సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై రానా దగ్గుబాటి సమర్పిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ '35- చిన్న కథ కాదు.' నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ కుట్టి నివేతా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

'35- చిన్న కథ కాదు ట్రైలర్

ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో నివేతా సరస్వతి అనే పాత్రలో ఒక సాధారణ గృహిణిగా కనిపించబోతున్నట్లు చూపించారు. ఇక నివేతా థామస్, విశ్వదేవ్ భార్య భర్తల పాత్రలో కనిపించగా.. ప్రియదర్శి స్కూల్ లో లెక్కల మాస్టర్ గా కనిపించారు. నివేతా, తన భర్త, ఇద్దరు పిల్లలు వాళ్ళ చదువుల చుట్టూ  తిరిగే కథాంశంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ లో 'ఓడిపోయే మైనస్ నుంచి.. గెలిచే ప్లస్ వైపు అడుగులువేయాలి.. జీవితంలో అందరికీ ఎదురయ్యే మజిలీ సున్నానే.. దాన్ని మనం దాటాలి,' 'మొట్టికాయ వేస్తేనే మోటివేషన్ వస్తుందా'... అనే డైలాగ్స్ ఆసక్తికరంగా అనిపించాయి. చదువు పై ఏ మాత్రం శ్రద్ద లేని ఒక కొడుకును తల్లిదండ్రులు ఎలా సపోర్ట్ గా ఉన్నారు..? స్కూల్లో టీచర్స్ ఎలా మోటివేట్ చేశారు.? అనే అంశాలతో ట్రైలర్ సాగింది.

Also Read: 35-ChinnaKathaKaadu: ‘సయ్యారే సయ్యా'... 35 – చిన్న కథ కాదు ఫస్ట్ సింగిల్ - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు