35-Chinna Katha Kaadu OTT: '35- చిన్న కథ కాదు' ఓటీటీ డీల్.. ప్రముఖ సంస్థకు స్ట్రీమింగ్ రైట్స్

నివేతా థామస్, విశ్వదేవ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ '35 – చిన్న కథ కాదు'. సెప్టెంబర్ 6న రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ 'ఆహా' సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

New Update
35-Chinna Katha Kaadu OTT: '35- చిన్న కథ కాదు' ఓటీటీ డీల్.. ప్రముఖ సంస్థకు స్ట్రీమింగ్ రైట్స్

35-Chinna Katha Kaadu:  సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పణలో రూపొందిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ '35-చిన్న కథ కాదు'. సెప్టెంబర్ 6న విడుదలైన ఈ చిత్రం అంచనలకు తగ్గట్టే బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక థియేటర్స్‌లో సందడి చేస్తుండగానే.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ సంబంధించిన అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.

డిజిటల్ రైట్స్ :

35 - చిన్నకథ కాదు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' సొంతం భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సాటిలైట్ టెలికాస్ట్ హక్కులను జీ తెలుగు ఛానెల్ దక్కించుకున్నట్లు సమాచారం. ఇక స్ట్రీమింగ్ డేట్, టైంకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

నందకిశోర్ ఇమానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేత థామస్, విశ్వాదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించారు. విశ్వాదేవ్- నివేదిత భార్య భర్తల పాత్రలో కనిపించిగా... ప్రియదర్శి లెక్కల మాస్టర్ పాత్రలో నటించారు. అనుదేవ్ పోతుల, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణతేజ, అభయ్, అనన్య తదితరులు మూవీలోని కొన్ని కీలకపాత్రలు పోషించారు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై సృజన్ ఎరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ మూవీని నిర్మించారు. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు వాళ్ళ చదువుల చుట్టూ తిరిగే కథనే '35- చిన్న కథ కాదు' సినిమా.

Also Read: 35-Chinna Katha Kaadu: ''అంతా సున్నా వల్లే వచ్చింది''... ఆసక్తికరంగా '35 – చిన్న కథ కాదు' ట్రైలర్ - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు