Bangladesh: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. 32 మంది మృతి!

బంగ్లాదేశ్ ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో రిజర్వేషన్లు రద్దు చేయాలని విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసనలలో ఇప్పటి వరకు 39 మంది చనిపోయారు.

New Update
Bangladesh: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. 32 మంది మృతి!

Bangladesh: బంగ్లాదేశ్ ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో రిజర్వేషన్లు రద్దు చేయాలని విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆందోళనకారుల్లో ఏడుగురు హత్యకు గురవడంతో ఈ హింస చెలరేగింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసనలలో ఇప్పటి వరకు 32 మంది చనిపోయారు. గురువారం ఒక్కరోజే 30 మంది చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. ఈ క్రమంలో శాంతియుతంగా ఉండాలంటూ నిరసనకారులను ఉద్దేశించి బంగ్లా ప్రధాని షేక్ హసీనా బుధవారం విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ సంస్థ బీటీవీ ప్రధాని వీడియో సందేశాన్ని ప్రసారం చేసింది. దీనిపై మండిపడ్డ నిరసనకారులు గురువారం ఢాకాలోని బీటీవీ హెడ్డాఫీసు ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నిరసనకారులపైకి పోలీసులు రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు బీటీవీ ఆఫీసులోకి చొచ్చుకెళ్లి ఫ్రంట్ ఆఫీసుకు నిప్పంటించారు. ప్రధాన ద్వారం వద్ద మంటలు చెలరేగడంతో చాలామంది ఉద్యోగులు లోపలే చిక్కుకుపోయారు. కొంత సేపటి తరువాత రెస్క్యూ సిబ్బంది సాయంతో అందరినీ క్షేమంగా బయటకు తీసుకు వచ్చినట్లు తెలిపింది.

ఆఫీసు పార్కింగ్ ప్లేస్ లోని పలు వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. బీటీవీ ప్రసారాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. మృతిచెందిన నిరసనకారులకి న్యాయం జరగాలని, ప్రధాని హసీనా క్షమాపణ చెప్పాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఆపేసింది.

Also read: ‘మైక్రోసాఫ్ట్’ క్రాష్​.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన బ్యాంకింగ్, విమాన సేవలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు