Wine Shop Tenders : వైన్ షాపులకు ఒక్క రోజే 3140 దరఖాస్తులు..ఖజానాకు 1400 కోట్లు!

తెలంగాణలో వైన్ షాప్ టెండర్లకు అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటివరకు 6913 దరఖాస్తులు రాగా..గురువారం ఒక్క రోజే 3140 దరఖాస్తులు వచ్చాయి. ఇక వీటి ద్వారానే ప్రభుత్వానికి 1400 కోట్ల ఆదాయం సమకూరింది. ఒక్క రంగారెడ్డి జిల్లా నుంచే 350 దరఖాస్తులు. దీంతో నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజుతోనే నిండుతున్న సర్కార్ ఖజానా...

Wine Shop Tenders : వైన్ షాపులకు ఒక్క రోజే 3140 దరఖాస్తులు..ఖజానాకు 1400 కోట్లు!
New Update

Telangana Wine Shop Tenders:  తెలంగాణలో వైన్ షాప్ టెండర్లకు అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటివరకు 6913 దరఖాస్తులు రాగా..గురువారం ఒక్క రోజే 3140 దరఖాస్తులు వచ్చాయి. ఇక వీటి ద్వారానే ప్రభుత్వానికి 1400 కోట్ల ఆదాయం సమకూరింది. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షలు పెట్టింది ప్రభుత్వం. దరఖాస్తులకు ఈ నెల 18 చివరి తేదీ. కాగా, టెండర్లు వేసే వారిని అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ కమిషనర్ హెచ్చరిస్తున్నారు.

అయితే రాష్ట్రంలో ప్రస్తుతమున్న వైన్ షాపుల అనుమతుల గడువు ఈ ఏడాది నవంబర్ తో ముగియనుంది. దీంతో మూడు నెలల ముందే ప్రభుత్వం కొత్త వైన్ షాపుల కోసం టెండర్లను ఆహ్వానించింది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసిన అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలున్నాయి. 2023 నుంచి 2025 వరకు తెలంగాణలో మద్యం దుకాణాలకు ఈ టెండర్లను పిలవడం జరిగింది. ఒక్కో దరఖాస్తుకు రెండు లక్షల రూపాయలను నాన్ రిఫండబుల్ ఫీజును ప్రభుత్వం పెట్టింది.

అయితే ఎక్కువగా రాజకీయ నాయకులు, వారి అనుచరులు దరఖాస్తు చేసుకుంటున్నారు. కాగా, రంగారెడ్డి, కరీనగర్, వరంగల్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఒక్క రంగారెడ్డి జిల్లా నుంచే 350 దరఖాస్తులు వచ్చాయి. దీంతో అక్కడ తీవ్ర పోటీ నెలకొంది.అయితే ఈ నెల 18 వరకు దరఖాస్తులకు సమయం ఉండడంతో ఇంకా ఎన్ని వస్తాయో చూడాలి. దీంతో నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజుతోనే సర్కార్ ఖజానా నిండనుంది. ఇక ఈ నెల 21న డ్రా పద్ధతిలో వైన్ షాపులను కేటాయించనున్నారు.

Also Read: రూ.500 కోట్లు ఎలా ఖర్చు చేశారు..?.. ప్రభుత్వాన్ని నివేదిక కోరిన హైకోర్టు

#ts-liquor-shops #telangana-wine-shop-tenders #telangana-liquor-shop-tenders
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe