Maharashtra: నాందేడ్ ప్రభుత్వాసుపత్రిలో ఏం జరుగుతుంది..48 గంటల వ్యవధిలో 31 మంది!

మహారాష్ట్ర (maharashtra) ప్రభుత్వాసుపత్రి (govt Hospital) లో ఏం జరుగుతుంది?. గడిచిన 48 గంటల్లో (48 Hours)  31 మంది (31 patients) పేషెంట్లు మరణించారు. కేవలం 24 గంటల వ్యవధిలో 24 మంది మృత్యువాత పడ్డారు.

New Update
Maharashtra: నాందేడ్ ప్రభుత్వాసుపత్రిలో ఏం జరుగుతుంది..48 గంటల వ్యవధిలో 31 మంది!

మహారాష్ట్ర (maharashtra) ప్రభుత్వాసుపత్రి (govt Hospital) లో ఏం జరుగుతుంది?. గడిచిన 48 గంటల్లో (48 Hours)  31 మంది (31 patients) పేషెంట్లు మరణించారు. కేవలం 24 గంటల వ్యవధిలో 24 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. తాజాగా మంగళవారం ఉదయం నుంచి మరో ఏడుగురు చనిపోయారు. మృతి చెందిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు.

చనిపోయిన 31 మందిలో 16 మంది చిన్నపిల్లలే ఉన్నారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వాసుపత్రి డీన్‌ డాక్టర్ శ్యామ్‌ రావ్‌ వాకోడ్‌ స్పందించారు. ప్రభుత్వాసుపత్రి మీద వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.

వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆసుపత్రిలో ఇన్ని మరణాలు సంభవించాయి అనేది అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. మందులు కొరత కానీ, వైద్యుల కొరత కానీ లేదని ఆయన తెలిపారు. సరైన వైద్య సదుపాయాలు అందిస్తున్నప్పటికీ..రోగులే చికిత్సకు స్పందించడం లేదని ఆయన వివరించారు.

ఈ విషయం గురించి తెలిసిన వెంటనే మహారాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి హసన్‌ ముష్రిఫ్‌ వెంటనే నాందేడ్‌ కు బయల్దేరారు. దీని గురించి ఆయన సోషల్‌ మీడియా వేదికగా ''నేను నాందేడ్‌ కు వెళ్తున్నాను. ఇది జరగాల్సిన విషయం కాదు. మందులు, వైద్యలు కొరత లేనే లేదు. మేము చనిపోయిన వారందరి గురించి కూడా దర్యాప్తు చేస్తాం. ఏదైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే ఎవర్ని వదిలిపెట్టేది లేదు'' అని మంత్రి పేర్కొన్నారు.

ఇప్పటికే ఈ మరణాల గురించి విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఛత్రపతి సంభాజీనగర్‌ జిల్లా నుంచి ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వాసుపత్రిలో జరిగిన మరణాలతో రాష్ట్రంలో ఏక్ నాథ్‌ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం పై ప్రతి పక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

ఈ విషయం గురించి తెలుసుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే..విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఈ ఘటన పై పూర్తి స్థాయి వివరణాత్మక విచారణకు ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన థానేలోని ప్రభుత్వాసుపత్రిలో ఆగస్టు నెలలో 18 మంది రోగులు చనిపోయిన ఘటన గురించి ప్రస్తావించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఈ విషయం గురించి స్పందించారు. మహారాష్ట్రలో అధికార కూటమిలో ఉన్న బీజేపీ ని ఆయన టార్గెట్‌ చేశారు. ‘బీజేపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం వేల కోట్లు ఖర్చు పెడుతుంది కానీ, పిల్లలకు మందులు కొనడానికి డబ్బులు లేవా?’’ అని రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

Also read: సూరత్‌..మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం

Advertisment
తాజా కథనాలు